మీరు ఈ పండుగకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక అదిరిపోయే శుభవార్త. ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ దసరా, దీపావళి పండుగ సందర్భంగా తన కస్టమర్లకు అదిరే ఆఫర్ అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఈ ఆఫర్ కింద 30 రోజుల పాటు 30 హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉచితంగా వినియోగదారులకు అందిస్తోంది. కంపెనీకి దేశవ్యాప్తంగా 700కు పైగా టచ్ పాయింట్లు ఉన్నాయి. వీటి ద్వారా కంపెనీ ఉచితంగానే రోజుకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అందించనున్నట్లు పేర్కొంది.
అక్టోబర్ 7 నుంచి నవంబర్ 7 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుదని హీరో తెలిపింది. లక్కీ విజేత కస్టమర్లు ఉచితంగానే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు. అయితే, మీరు గనుక ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్ పొందాలని భావిస్తే.. మొదట మీరు వెబ్సైట్ లేదా డీలర్ సెంటర్లలో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి. ఇలా కొనుగోలు చేసిన వారు మాత్రమే ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. లక్కీ డ్రా ద్వారా ప్రతి రోజూ ఒక విజేతను ప్రకటిస్తారు. వారు చెల్లించిన వెహికల్ ఎక్స్‌షోరూమ్ డబ్బులను పూర్తిగా వెనక్కి ఇస్తారు.(చదవండి: అదృష్టమంటే ఇదేనెమో..! 4 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు సొంతం..!)
