topmost-visited-websites-in-2021

Top 10 Most Visited Websites in The World 2021: ఇంకొన్ని రోజులు ఆగితే మనం కొత్త ఏడాది 2022లోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే, 2021లో చాలా మంది వెతికిన వెబ్ సైట్ ఏది అనగానే వెంటనే గూగుల్ అనే చెప్పేస్తాం అంటే మీరు కూడా పప్పులో కాలు వేసినట్లే. గూగుల్ కంటే మరోక పోర్టల్ ని ఇంటర్నెట్ యూజర్లు తెగ వెతికేశారు. అది ఏంటో తెలుసా? అదేనండీ మన దేశంలో కేంద్ర ప్రభుత్వం నిషేదం విధించిన టిక్‌టాక్‌ మొదటి స్థానంలో నిలచింది. 2021లో అత్యధికంగా సందర్శించిన వెబ్‌సైట్ల జాబితాలో మొదటి స్ధానంలో టిక్‌టాక్‌ నిలిస్తే, తరువాతి స్థానంలో గూగుల్‌ నిలవడం విశేషం.

  1. టిక్‌టాక్‌. కామ్‌: గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నిషేదించిన ప్రముఖ షార్ట్‌ వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌ ప్రపంచంలోనే ఎక్కువ మంది సందర్శించిన వెబ్‌సైట్‌గా నిలిచింది. సుమారు 1 బిలియన్ యాక్టివ్ వినియోగదారులను టిక్‌టాక్‌ కలిగి ఉంది.

2. గూగుల్‌.కామ్‌: మనకు ఏదైనా చిన్న సమస్య వచ్చిదంటే చాలు వెంటనే గూగుల్‌ సెర్చ్‌ చేయాల్సిందే. ఇంత పాపులర్ సర్చ్ ఇంజిన్ 2021లో రెండవ స్థానంలో ఉండడం విశేషం. ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే రెండవ వెబ్‌సైట్‌గా గూగుల్ స్థానాన్ని దక్కించుకున్నది.

  1. ఫేస్‌బుక్‌.కామ్‌: టిక్‌టాక్‌, గూగుల్‌ తర్వాత అత్యంత ఎక్కువగా వెతికేది ఫేస్‌బుక్‌. ఈ సోషల్ మీడియా దిగ్గజం ఈ ఏడాదిలో అత్యధికంగా సందర్శించిన వెబ్‌సైట్ల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. 2021లో ఫేస్‌బుక్‌ తన మాతృసంస్థ పేరును మెటాగా మార్చుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఏడాది ఫేస్‌బుక్‌కు అంతగా కలిసి రాకున్న మూడో స్థానంలో నిలిచింది.
  2. మైక్రోసాఫ్ట్‌: ప్రముఖ విండోస్ ఓఎస్ వెబ్‌సైట్‌ మైక్రోసాఫ్ట్‌ ఈ ఏడాది నాలుగో స్ధానంలో నిలిచింది. మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన వన్‌డ్రైవ్‌, ఎక్స్‌బాక్స్‌లను యూజర్లు భారీగా సందర్శించారు.
  3. యాపిల్‌: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ 5వ స్థానంలో కొనసాగడం అనేది అందరికి కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఐక్లౌడ్‌, యాప్‌స్టోర్‌​ వంటి ఇతర సేవలను సందర్శించే వ్యక్తులు అధికంగా ఉన్నప్పటికీ ఈ స్థానాన్ని కలిగి ఉంది.

ఇక ఆ తర్వాత 6వ స్థానంలో అమెజాన్, 7వ స్థానంలో నెట్ ఫ్లిక్స్, 8వ స్థానంలో యూట్యూబ్, 9వ స్థానంలో ట్విటర్, 10వ స్థానంలో వాట్సాప్ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here