Ola-Electric-Scooter-S1-Pro

మీరు ఈ ఏడాది విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. వచ్చే ఏడాది 2022 జూన్ వరకు హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఉచితంగా ఛార్జ్ చేసుకోవచ్చు అని సంస్థ తెలిపింది. అలాగే, ఈ రైడ్-హైలింగ్ సంస్థ ఓలా ప్రధాన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) పంపులతో పాటు నగరాల్లోని నివాస సముదాయాల వద్ద హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం ప్రారంభించినట్లు కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ఇలాంటి పాయింట్లు 4000కు పైగా అందుబాటులోకి వస్తాయని అగర్వాల్ తెలిపారు.

ఈ హైపర్ ఛార్జర్లను భారతదేశం అంతటా ఏర్పాటు చేస్తున్నారని, వాటిని 6-8 వారాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ హైపర్ ఛార్జర్లు వచ్చే ఏడాది జూన్ చివరి వరకు వినియోగదారులందరికీ ఉచితంగా వినియోగించుకోవచ్చు అని ఆయన అన్నారు. ఈ హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్ తమ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ వాహనాలను కేవ‌లం 18 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేయ‌గ‌ల‌ద‌ని, ఇది 75 కిలోమీట‌ర్లు దూరం వ‌ర‌కు వెళ్ల‌డానికి
సంస్థ స‌రిపోతుంద‌ని తెలిపింది. భారతదేశం అంతటా కీలకమైన మాల్స్, ఐటీ పార్కులు & ప్రముఖ ప్రదేశాలలో కూడా స్టాండ్ ఎలోన్ ఛార్జర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ ఛార్జర్లను ఓలా భాగస్వాములు నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here