దేశంలోని ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలపై రోజురోజుకి ఆసక్తి పెరుగుతుంది. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల సంఖ్య 40 శాతంపైగా పెరిగినట్లు ఒక నివేదిక పెరిగింది. దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ వాహనా రంగం ఎంత వేగంగా విస్తరిస్తుందో అని. చాలా కంపెనీల ఎలక్ట్రిక్ వాహన కంపెనీల బైక్ లు, స్కూటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ సామాన్య ప్రజానీకం ధరను కొనుగోలుచేయడానికి ఆలోచిస్తున్నారు.(ఇది చదవండి: ప్రపంచంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదల)

చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలు స్పీడ్ తక్కువగా వెళ్లడం లేదా ధర ఎక్కువగా ఉండటం చేత సామాన్య ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ సమస్యలు అన్నీ దృష్టిలో పెట్టుకొని సామాన్యుల‌కు అందుబాటులో ఉండేలా ఎల‌క్ట్రిక్ స్కూటర్లను హైదరాబాద్ కు చెందిన ప్యూర్ ఈవీ అనే ఒక స్టార్టప్ సంస్థ తయారు చేస్తుంది‌. ఈ సంస్థకు చెందిన “ఇప్లూటో 7 జీ” అనే హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 116 కి.మీ వ‌ర‌కు ఆగకుండా ప్ర‌యాణం చేయోచ్చ‌ని సంస్థ పేర్కొంటుంది.(ఇది చదవండి: హీరో ఎలక్ట్రిక్ సంచలనం: సింగిల్ చార్జ్ తో 200 కి.మీ ప్రయాణం)

మరో ముఖ్య విషయం ఏమిటంటే దీనిని ఫుల్ ఛార్జ్ చేయయడానికి అయ్యే ఖర్చు 17 రూపాయలు మాత్రమే అని ప్యూర్ ఈవీ పేర్కొంది. అంటే కేవ‌లం రూ.17తోనే సుమారు 116 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయవచ్చు అన్నమాట‌. అలాగే, ఈ స్కూటర్ కేవ‌లం 5 సెక‌న్లలోనే దాదాపు 40 కిమీ స్పీడ్ ను అందుకుంటుంది. ఇప్లూటో 7జీ గరిష్ట వేగం 60 కిలోమీట‌ర్లు. ఇది 2.5 కేడ్ల్యూహెచ్ లిథియోమ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దీనిని ఫుల్ చార్జ్ చేయ‌డానికి 4గంట‌ల సమయం ప‌డుతుంది. ఇప్లూటో 7 జీ ఎక్స్ షోరూమ్ ధర రూ.83,999 గా కంపెనీ నిర్ణ‌యించింది. ఐదేళ్ల వారంటీతో పాటు వ‌చ్చే ఈ బైక్ తీసుకోవ‌డానికి ప‌లు బ్యాంక్ లు లోన్ కూడా అందిస్తున్నాయి.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.