Friday, May 3, 2024
HomeHow ToUpdate Aadhar Card: ఆధార్‌ వివరాలను ఫ్రీగా అప్‌డేట్ చేసుకోండి ఇలా..?

Update Aadhar Card: ఆధార్‌ వివరాలను ఫ్రీగా అప్‌డేట్ చేసుకోండి ఇలా..?

How Update Aadhar Details in Telugu: మీ ఆధార్ కార్డ్‌లోని వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఆధార్ ఫ్రీ అప్‌డేషన్‌ గడువును 2023 డిసెంబర్‌ 14వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే పెంచింది. అంతకు ముందు ఈ గడువు సెప్టెంబరు 14, 2023 వరకూ ఉండేది.

ఆధార్‌లో ఏయే వివరాలను ఫ్రీగా మార్చుకోవచ్చు?

మీ ఆధార్‌ కార్డ్‌లో… మీ పుట్టిన తేదీ తప్పుగా ఉన్నా, పేరు తప్పుగా పడిన, జెండర్‌లో తప్పు దొర్లినా, మీ అడ్రస్‌, మొబైల్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ(Name, Address, DoB, Gender, Mobile & Email ID Details Change in Aadhaar Card) వంటివి ఫ్రీగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో మీ వివరాలను అప్‌డేషన్‌ చేయడానికి తగిన రుజువు పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

(ఇది కూడా చదవండి: ఆధార్‌తో ఏ నెంబర్ లింక్ అయ్యిందో చెక్ చేసుకోండి ఇలా..?)

ఆఫ్‌లైన్‌/ఆధార్‌ కేంద్రం/CSCకి వెళ్లి ఆధార్‌ సమాచారాన్ని అప్‌డేట్‌ చేయాలనుకుంటే మాత్రం 25 రూపాయల ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

ఆధార్ వివరాలను ఫ్రీగా ఎలా అప్‌డేట్ చేయాలి?

  • ముందుగా myaadhaar.uidai.gov.in లింక్‌ ద్వారా ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, మీ ఆధార్‌ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
  • ఆ తర్వాత మీ పేరు/లింగం/పుట్టిన తేదీ, చిరునామా ఆప్షన్ ఎంచుకొని అప్‌డేట్ ఆధార్ ఆప్షన్‌ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు, చిరునామా లేదా ఇతర సమాచారాన్ని అప్‌డేట్‌ చేయడానికి అక్కడ కనిపించే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత, స్కాన్ చేసిన ప్రూఫ్‌ కాపీలను అప్‌లోడ్ చేసి, డెమోగ్రాఫిక్ డేటాను (Demographic data) అప్‌డేట్‌ చేయండి.
  • ఇప్పుడు మీకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్‌ నంబర్ (URN) వస్తుంది. ఆ నెంబర్‌ను సేవ్‌ చేసుకోండి. ఆధార్‌ అప్‌డేషన్‌ స్టేటస్‌ తనిఖీ చేయడానికి ఆ నెంబర్‌ ఉపయోగపడుతుంది.

ఆధార్ అప్‌డేషన్‌ ప్రాసెస్‌ను ఎలా ట్రాక్ చేయాలి?

  • ఆధార్ కార్డ్‌లో మార్పుల కోసం మీరు రిక్వెస్ట్‌ చేసిన తర్వాత, మీకు ఒక URN నంబర్ వస్తుంది. అది మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు కూడా SMS ద్వారా అందుతుంది.
  • ఇప్పుడు మీరు https://ssup.uidai.gov.in/checkSSUPStatus/checkupdatestatus లింక్‌ ద్వారా పోర్టల్‌లోకి వెళ్లి, మీ ఆధార్ కార్డ్ వివరాల అప్‌డేషన్‌ స్థితిని ట్రాక్ చేయవచ్చు.

డెమోగ్రాఫిక్ డేటాను ఎప్పుడు అప్‌డేట్‌ చేయాలి?

  • మన దేశంలో వివాహానంతరం మహిళ ఇంటి పేరు మారుతుంది. ఇలాంటి సందర్భంలో మార్పులు చేసుకోవచ్చు.
  • పుట్టిన తేదీ, పేరు, చిరునామాలో తప్పులు దొర్లినా మీ ఆధార్ డిటెయిల్స్‌ అప్‌డేట్‌ చేయాలి.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles