మీ దగ్గర ఏదైనా వాహనం ఉందా? లేదా ఏదైనా కొత్త వాహనం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక మంచి శుభవార్త. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటారు వాహన 1989 చట్టంలోని కొన్ని నిబందనలను మార్పులు చేసింది. ఈ నిబందనలలో మార్పులు చేయడం వల్ల వాహనదారులకు మరింత ప్రయోజనం చేకూర్చింది. ఈ కొత్త నిబందనల ప్రకారం.. వాహన యజమాని తన వాహన రిజిస్ట్రేషన్ సమయంలో తన వాహనానికి నామినీ పేరును కూడా జత చేసుకునే వీలు కల్పించింది. గతంలో మనకు ఈ అవకాశం లేదు. ప్రస్తుతం మనం ఎలాగైతే బ్యాంక్ ఖాతా, భీమా వంటి ఖాతాలకు నామినీని జత చేస్తూన్నామో అలాగా వాహనాలకు కూడా నామినీ పేరు జత చేయవచ్చు.
కొత్త నిబందనల ప్రకారం.. వాహన యజమాని మరణించినప్పుడు ఇక ఆ వాహనాన్ని నామినీ పేరు మీద మార్చుకోవడానికి సులభతరం కానుంది. దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉండే విదంగా ఈ కొత్త నిబందనలు తీసుకువచ్చింది. ఇక నామినీ పేరును వాహన రిజిస్ట్రేషన్ సమయంలో లేదా తర్వాత ఆన్‌లైన్ ద్వారా జత చేయవచ్చు. నామినీ పేరును జత చేయాలంటే తప్పనిసరిగా అతని గుర్తింపు కార్డు సమర్పించాలి. దీనివల్ల భవిష్యత్ కాలంలో వాహనాన్ని తన పేరు మీద మార్చుకోవడానికి సులభతరం అవుతుంది.(ఇది కూడా చదవండి: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త..!)

వాహన యజమాని మరణించిన 30 రోజులలోపు యజమాని మరణించినట్లు రిజిస్ట్రేషన్ అథారిటీకి తెలపాల్సి ఉంటుంది. అలాగే, వాహనాన్ని నామినీ పేరు మీద మార్చుకోవడానికి వాహన యజమాని మరణించిన 3 నెలల్లో నామినీ వాహన బదిలీ కోసం ఫారం-31ను అధికారులకు లేదా ఆన్లైన్ ద్వారా సమర్పించాలి. పెళ్లి విడాకులు, ఆస్తి విభజన వంటి సందర్భాల్లో నామినీ మార్పు చేర్పులు చేయాలంటే వాహన యజమాని అంగీకరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP) సహాయంతో మార్చవచ్చు.
ఇప్పటి వరకు నామినీని జతచేయడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం ఉన్న విధానం వల్ల వాహనం రిజిస్టర్డ్ యజమాని మరణించిన సందర్భంలో వాహనాన్ని నామినీకి బదిలీ చేయడానికి వివిధ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాలి. ఈ విధానం రాష్ట్రం నుంచి రాష్ట్రానికీ మారుతూ ఉంటుంది. యజమాని మరణించిన సందర్భంలో వాహన బదిలీ కోసం చట్టపరమైన వారసుడిగా గుర్తింపు పత్రం చూపించాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందులన్నింటికి చెక్ పెడుతూ కొత్త నిబందనలు జారీ చేసింది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.