Amazon Great Indian Festival 2021: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021 అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నట్లు సంస్థ పేర్కొంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీకి సంబందించి అమెజాన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో టీజ్ చేసింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఒక రోజు ముందుగానే ఈ సేల్ లో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ను ప్రకటించిన కొన్ని రోజులకే అమెజాన్ తన ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించింది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్‌లో అమెజాన్ పోటీదారు ఫ్లిప్‌కార్ట్ కూడా పండుగ ఆఫర్లతో దూసుకు వస్తోంది.(చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ బంపర్ ఆఫర్)
అక్టోబర్ నెల 3వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో కస్టమర్లను ఆకట్టు కోవడం కోసం అమెజాన్ వివిధ మొబైల్ ఫోన్ మోడల్స్, యాక్ససరీలు, స్మార్ట్ వాచ్, ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో సహా ఇతర గృహోపకరణాలపై భారీగా డిస్కౌంట్లను అందించనున్నట్లు పేర్కొంది. అమెజాన్ ఎకో, ఫైర్ స్టిక్, కిండ్లే డివైజ్‌లనూ కూడా తక్కువ ధరకే అందించనుంది. దీంతో పాటు యాపిల్, ఆసుస్, ఫాజిల్, హెచ్‌పీ, లెనోవో, వన్‌ప్లస్, శాంసంగ్, సోనీ, షావోమికి చెందిన వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులను సేల్‌లో భాగంగా లాంచ్ చేయనున్నారు. ఈ సేల్ దీపావళి వరకు కొనసాగే అవకాశం ఉంది.