అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకాలు తేదీలను అక్టోబర్ 6న జరిగే కంపెనీ వర్చువల్ మీడియా ఈవెంట్‌ లో తెలపనున్నారు. ఈ పండుగ అమ్మకాలలో స్మార్ట్ ఫోన్స్, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్, అనేక రకాల వస్తువులపై భారీ మొత్తంలో డిస్కౌంట్స్ లభిస్తాయి. ఎవరైతే అమోజాన్ ప్రైమ్ అకౌంటు కలిగి ఉంటారో వారు ఒక రోజు ముందుగానే సేల్ లో పాల్గొనవచ్చు. మనకు ఇప్పటి వరకు తెలిసిన ఆఫర్లు ఇలా ఉన్నాయి. ఈసారి సేల్ కొనుగోలు చేసే వస్తువుల మీద గరిష్టంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ 1000 రూపాయలు మించకుండా ఇవ్వబోతుంది. హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ వినియోగదారులకు మాత్రం 10 శాతం వరకు వెంటనే డిస్కౌంట్ లభిస్తుండగా, బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డు వాడే వినియోగదారులు మాత్రం రూ .1 లక్ష వరకు క్రెడిట్ పొందవచ్చు. (చదవండి: షాకింగ్ న్యూస్.. పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు)

స్మార్ట్ ఫోన్లు మరియు ఇతర ఉపకరణాల మీద ఇంత వరకు లేని ఆఫర్లను తీసుకొస్తునట్లు అమెజాన్ తెలిపింది. ప్రతి బడ్జెట్‌లో నో-కాస్ట్ ఇఎంఐలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్‌లపై టోటల్ డామేజ్ ప్రొటెక్షన్ కల్పిస్తామని అమెజాన్ హామీ ఇచ్చింది. అంతేకాక, మొబైల్ accessoriesలపై మంచి డీల్స్ అందిస్తామని పేర్కొంది. అమెజాన్ కొత్తగా విడుదల చేసే ఉత్పత్తులపై కూపన్స్ తో పాటు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల మీద 70 % వరకు డిస్కౌంట్స్ లభిస్తుందని అని తెలిపింది. పుస్తకాలతో పాటు, బొమ్మలు మరియు ఆటలకు సంబందించిన వస్తువులపై కూడా 70 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది అని పేర్కొంది.

200 కంటే ఎక్కువ బ్రాండ్లలో ఉన్నా హోమ్ మరియు కిచెన్ ఉత్పత్తులపై అమెజాన్ 80 శాతం వరకు మినహాయింపు ఇస్తోంది. ఇల్లు మరియు వంటగది appliancesపై కాంబో ఆఫర్లు లభిస్తాయని తెలిపింది. టీవీలు మరియు ఇంటికి సంబందించిన వాటి మీద 65 శాతం డిస్కౌంట్, warranty పొడగించడంతో పాటు ఉచిత ఇన్స్టలేషన్ లభిస్తాయి. మనం ధరించే దుస్తులు మీద అమెజాన్ ఫ్యాషన్ 30 రోజుల రిటర్న్ ఆప్షన్ తో పాటు ప్రైమ్ మెంబర్స్ కోసం 80 శాతం వరకు తగ్గింపు కూడా ఇస్తుంది.(చదవండి: షాకింగ్ న్యూస్.. పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు)

అమెజాన్ రోజువారీ నిత్యావసరాల సరుకుల మీద 20-70 శాతం తగ్గింపును ప్రకటించింది, ఇక్కడ రూ .99 నుండి ఆఫర్లు ప్రారంభమవుతున్నాయి. అమెజాన్ 20000 ఉత్పత్తులతో వ్యవహరించే అమెజాన్ బ్రాండ్లపై 70 శాతం తగ్గింపును ఇస్తుంది మరియు అమెజాన్ పే ద్వారా చేసే చెల్లింపులపై క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తుంది. అమెజాన్ ఎకో, ఫైర్ టివి, కిండ్ల్‌ పై కూడా 50 శాతం వరకు రాయితీ ఇస్తుంది. ఇతర అమెజాన్ ఆఫర్లలో రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి మధ్య షాపింగ్ చేసే వినియోగదారులకు గోల్డెన్ అవర్ డీల్స్ కూడా ఉంటాయి.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.