దసరా పండగ సీజన్ ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ “బిగ్ బిలియన్ డేస్” అతి పెద్ద సేల్ కు సిద్దమైంది. ఈ బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలు అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 21 వరకు కొనసాగుతాయి అని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. ఈ సేల్ లో పాల్గొనే ఎస్బిఐ కార్డు వినియోగదారులకు ప్రత్యేకంగా ఆఫర్లు అందిస్తుంది. ఎస్బిఐ కార్డులను ఉపయోగించి చేసిన కొనుగోళ్లకు 10 శాతం తక్షణ తగ్గింపును అందించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్స్‌ ఒకరోజు ముందుగానే అంటే 15వ తేదీ నుంచే సేల్ లో పాల్గొనవచ్చు.(చదవండి: ఈ వాట్సప్ స్టేటస్ ట్రిక్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా?)

బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ ఈఎంఐఐ కార్డులు, ఇతర ప్రముఖ బ్యాంకుల క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపైనా నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. ఇంకా, Paytm Wallet మరియు Paytm UPIని ఉపయోగించి కొనుగోళ్లు చేసే వినియోగదారులకు కూడా క్యాష్‌బ్యాక్ ఇవ్వనునట్లు తెలిపింది. బిగ్ బిలియన్ డేస్ 2020 అమ్మకాలలో ఫ్లిప్ కార్ట్ మొబైల్, టీవీలు మరియు ఇతర గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర ఉత్పత్తుల మీద డిస్కౌంట్ లు ఇస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే తన వెబ్‌సైట్‌లో ది బిగ్ బిలియన్ డేస్ ఎక్స్‌క్లూజివ్ లాంచ్ పేరుతో కొన్ని ఆఫర్లను ప్రకటించింది.

‘బిగ్‌బిలియన్‌ డేస్‌’ వల్ల 70 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని, మరో లక్ష మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. 850కి పైగా నగరాల్లోని వినియోగదారులకు చివరి మైలు చెర వేయడానికి ఇ-రిటైలర్‌కు సహాయపడే 50,000 కిరాణ దుకాణాలతో ఒప్పందం చేసుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.(చదవండి: ఈ వాట్సప్ స్టేటస్ ట్రిక్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా?)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here