పండుగ సీజన్ ముందు ఫ్లిప్‌కార్ట్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్దులకు శుభవార్త తెలిపింది. రాబోయే పండుగ సీజన్ లో Walmart యాజమాన్యంలో ఫ్లిప్‌కార్ట్ సంస్థ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈవెంట్ ద్వారా వేలాదిగా ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాలని చూస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఇప్పడు టైర్- II నగరాల నుండి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్దులకు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ లను అందిస్తుంది. పండుగ సీజన్ మరియు బిగ్ బిలియన్ డేస్ కంటే ముందే విద్యార్దులు తమ ‘లాంచ్ ప్యాడ్’ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలో భాగంగా డెలివరీ చైన్ లో పనిచేస్తారని తెలిపింది. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 45 రోజులు ఉంటుందని తెలిపింది. ఈ ఇంటర్న్ షిప్ విద్యార్దులు Flipkart డెలివరీ మరియు e కామర్స్ నిర్వహణలో క్లిష్టమైన నైపుణ్యాలను పెంపోదించుకోవడంలో దోహదపడుతుందని తెలిపింది. గత సంవత్సరం జరిగిన ఇంటర్న్ షిప్ లో 2 వేల మంది విద్యార్దులు పాల్గొన్నారు.(చదవండి: మరో సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చిన వాట్సాప్)
ఈ – కామర్స్ లో వెన్నుముకగా ఉండే డెలివరీ ప్రక్రియలను విద్యార్థులు అర్థం చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని తెలిపింది. ఇంటర్న్‌షిప్ లో పాల్గొనే విద్యార్దులకు స్థానిక రాష్ట్ర మరియు కార్మిక చట్టాల ఆధారంగా రోజుకు 600 రూపాయలు ఇస్తామని తెలిపింది. ఈ ఫ్లిప్‌కార్ట్ ఇంటర్న్ షిప్ అనేది భారత దేశంలోని బినోలా (హర్యానా), భివాండి (మహారాష్ట్ర), ఉలుబెరియా మరియు డంకుని (పశ్చిమ బెంగాల్) మరియు మలూర్ (కర్ణాటక), మేడ్చల్ (తెలంగాణ) మరియు మరెన్నో ప్రదేశాలలో 21 విద్యాసంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. విద్యార్దులు డబ్బుతో పాటు, కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం లభిస్తుందని కంపెనీ తెలిపింది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.