పసిడి ధరల్లో రోజు రోజుకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నేడు ఉన్న బంగారం ధర రేపు ఉండటం లేదు. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర. నేడు (మార్చి 7) అతి స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారంపై రూ.10 మేర పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.10 పెరిగి రూ.41,710, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,500కు చేరుకుంది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధరలు పేరుగుతుంటే మాత్రం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70100గా ఉంది.

అయితే, గత ఏడాది ఆగస్టు నుండి రూ.12వేల మేర పతనం కావడం గమనార్హం. దేశీయంగా పసిడి ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.