బంగారం ధర రెండో రోజుల నుంచి నేలచూపులు చూస్తోంది. పసిడి కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర తగ్గడం ఇది వరుసగార రెండో రోజు కావడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గి ధర ₹47,350కు పడిపోయింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.350 క్షీణించి ₹43,400కు చేరుకుంది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరగింది. కేజీ వెండి ధర రూ.300 పెరిగి ₹74,700కు చేరుకుంది. కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.