మన దేశ ఆర్ధిక వ్యవస్థ మీద కరోనా మహమ్మారి పెను ప్రభావం చూపించింది. ఈ మహమ్మారి వల్ల చిన్న, చిన్న కుటుంబాలు ఆర్ధిక విష వలయంలో చిక్కుకున్నాయి. కుటుంబాల పరిస్థితి ఇలా ఉంటే ఎమ్ఎస్ఎమ్ఈలకు చెందిన వ్యాపారాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యాపార సంస్థలను ఆదుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే, కష్టకాలంలో ఎమ్ఎస్ఎమ్ఈలకు తాము అండగా ఉంటామని కెనరా బ్యాంక్ ముందుకు వచ్చింది. మన దేశంలో గోల్డ్ లోన్ అత్యవసర ఆర్థిక సాయంగా పరిగణిస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే.

అందుకే కెనరా బ్యాంక్ వ్యక్తిగత, ఎమ్ఎస్ఎమ్ఈల కోసం గోల్డ్ లోన్ లను అందిస్తోంది. “కెనరా బ్యాంక్ మా ఖాతాదారులకు ఆకర్షణీయమైన బంగారు రుణాలను తక్కువ వడ్డీరేట్లకే అత్యవసర ఆర్థిక సహాయం కింద అందిస్తుంది. మా బ్యాంక్ వల్ల మీకు భద్రత ఎక్కువ లభిస్తుంది” అని కెనరా బ్యాంక్ ట్వీట్ చేసింది. కెనరా బ్యాంక్ ఖాతాదారులకు 7.35 శాతం వడ్డీరేటుకే “గోల్డ్ లోన్”ను అందిస్తోంది. ఏవైనా సందేహాలు ఉంటే 1800 425 0018 /1800 103 0018కు కాల్ చేయవచ్చు అని తెలిపింది. మీ లాకర్ లోని బంగారం మీ వ్యాపారానికి గోల్డ్ మైన్ కావచ్చు అని కెనరా బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్ ఎమ్ఎస్ఎమ్ఈల కొరకు ఓవర్ డ్రాఫ్ట్ లేదా డిమాండ్ లోన్ సదుపాయాన్ని అందిస్తోంది. ఈ గోల్డ్ లోన్ కింద రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు రుణ మొత్తాన్ని అప్పుగా తీసుకోవచ్చని బ్యాంకు తెలిపింది.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.