SBI WhatsApp Banking Services: దేశంలోని ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ(SBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఖాతాదారులు బ్యాంక్ బ్యాలెన్స్, మీని స్టేట్మెంట్ కోసం బ్యాంకుకి వచ్చే అవసరం లేకుండా కొన్ని సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు ఎస్‌బీఐ సిద్ధమైంది. ఇందుకోసం ఖాతాదారులు ఎలాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం, ఏటీఎం సెంటర్‌కు వెళ్లే అవసరం కూడా లేదని ఎస్‌బీఐ(SBI) ఛైర్మన్ దినేష్ ఖారా తెలిపారు.
వాట్సాప్‌లో ఎస్‌బీఐ బ్యాంక్ బ్యాలెన్స్, చెక్ చేసుకోండి ఇలా..?
వాట్సాప్‌లో ఎస్‌బీఐ(SBI) సేవలు వాట్సాప్‌లో పొందాలంటే.. అందు కోసం మీరు కొన్ని పద్దతుల్ని అనుసరించాల్సి ఉంటుంది. ముందుగా బ్యాంక్‌లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 917208933148కు WAREG(కేపిటల్ లెటర్స్), అకౌంట్ నెంబర్(Account Number) [EX: WAREG 12345678901] అని టైప్ చేసి ఎస్‌ఎంఎస్ చేయండి.
- మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత 919022690226 నంబర్ చేసుకొని ‘Hi SBI’ అని టైప్ చేయండి.
- ప్రియమైన వినియోగదారులారా, ఎస్‌బీఐ(SBI) వాట్సాప్ బ్యాంకింగ్ సేవలకు స్వాగతం క్రింద ఉన్న ఆప్షన్ ఎంచుకోండి అని ఒక మెసేజ్ వస్తుంది.
- బ్యాంక్ బ్యాలెన్స్
- మినీ స్టేట్‌మెంట్
- వాట్సాప్ బ్యాంకింగ్ నుంచి డిఈ-రిజిస్టర్ చేసుకోండి
- మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి లేదా మీ చివరి ఐదు ట్రాన్సాక్షన్‌లకు సంబంధించిన స్టేట్మెంట్(మినీ) పొందడానికి 1 లేదా 2 ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. మీరు ఎస్‌బీఐ(SBI) వాట్సాప్ బ్యాంకింగ్ నుండి డిఈ-రిజిస్టర్ చేయాలనుకుంటే..మీరు 3 ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.
మీరు పైన పేర్కొన్నట్లుగా సెలక్ట్ చేసుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ లేదా మినీ స్టేట్మెంట్ పొందవచ్చు. మిగిలిన సంబంధ వివరాలు కావాలనుకుంటే టైప్ చేసి అడగొచ్చు.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌కు సైతం
ఎస్‌బీఐ(SBI) ఈ వాట్సాప్ సేవల్ని తన క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అందిస్తుంది. వాట్సాప్ కనెక్ట్ పేరుతో క్రెడిట్ కార్డ్ కస్టమర్లు అకౌంట్ డీటెయిల్స్, రివార్డ్ పాయింట్లు, బ్యాలెన్స్, కార్డ్ చెల్లింపులతో పాటు పలు సేవలు అందుబాటులో ఉన్నాయి.