ఎల్‌పీజీ వినియోగదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఎప్పటి నుంచో పడుతున్న కష్టాలకు స్వస్తి పలికింది. ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్టిబ్యూటర్ ను ఎంచుకోవడంతో పాటు అక్కడి నుంచే గ్యాస్ సిలిండర్ కూడా పొందవచ్చని కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా.. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి వినియోగదారులు ఎదుర్కొంటున్న కష్టాల్ని ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నించారు. దీనికి కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరుల శాఖ మంత్రి రామేశ్వర్ స్పందిస్తూ.. ‘ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్టిబ్యూటర్ ను ఎంపిక చేసుకోవడంతో పాటు వారి వద్ద నుంచే సిలిండర్ కూడా ఫిల్ చేయించుకోవచ్చు’అని మంత్రి ప్రకటించారు.
ఇప్పటి వరకు సిలిండర్ వినియోగదారులు కేవలం తమ కనెక్షన్ తీసుకున్న డిస్టిబ్యూటర్ నుంచి మాత్రమే గ్యాస్ ఫిల్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇకపై సిలిండర్ కోసం ఎటువంటి ఇబ్బందులు పడకుండా నచ్చిన డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్ తెచ్చుకునే వెసులుబాటును పైలట్ ప్రాజెక్టు కింద చండీగడ్, కోయంబత్తూర్, గుర్గావ్, పూణే, రాంచీలలో ఇప్పటికే అమలు చేస్తున్నారు. పార్లమెంటులో కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరుల శాఖ మంత్రి రామేశ్వర్ చేసిన ప్రకటనతో ఈ పథకం త్వరలోనే దేశమంతటా అమలు చేస్తారని తెలుస్తోంది. మొత్తంగా కేంద్రం తాజా నిర్ణయం గ్యాస్ వినియోగదారులకు ఊరట కలిగించింది.
Support Tech Patashala
