mark zuckerberg Facebook

ఫేస్‌బుక్‌ స్థాపించినప్పటికీ ఇప్పటిదాకా చూసుకుంటే.. అక్టోబర్‌ 4న తలెత్తిన సమస్య ఆ సంస్థకు భారీ నష్టాన్ని తెచ్చి పెట్టింది. ఆరు గంటలపాటు ఆగిపోయిన ఫేస్‌బుక్‌ దాని అనుబంధ యాప్‌ సర్వీస్‌లు ఫేస్‌బుక్‌ మెసేంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ సేవలను సైతం స్తంభింపజేసింది. తిరిగి సర్వీసులు ప్రారంభమైనప్పటికీ.. మొదట్లో మొండికేశాయి కూడా. ఈ ప్రభావం ఇంటర్నెట్‌పై పడగా.. ట్విటర్‌, టిక్‌టాక్‌, స్నాప్‌ఛాట్‌ సేవలు సైతం కాసేపు నెమ్మదించాయి.

ఈ బ్రేక్‌డౌన్‌ వల్ల ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌కు మాత్రం కోలుకోలేని దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ సేవల సర్వీసుల విఘాతం వల్ల మార్క్‌ జుకర్‌బర్గ్‌ భారీ నష్టం వాటిల్లింది. మార్క్ జుకర్‌బర్గ్‌ వ్యక్తిగత సంపద కొన్ని గంటల్లో దాదాపు $7 బిలియన్లు (సుమారు. 50 వేల కోట్లు) నష్టపోయారు. ఈ దెబ్బకు ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో అతని స్థానం కూడా పడిపోయింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ స్టాక్ ధర సుమారు 5% నష్టపోతే, గత నెలలో సుమారు 15% నష్టపోయారు.(చదవండి: వాట్సాప్‌లో ఇన్ని షార్ట్‌కట్స్ ఉన్నాయా?)

ఇదే మొదటిసారి

ఈ దెబ్బకు జుకర్ బర్గ్ నికర విలువను 120.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో 5వ స్థానానికి పడిపోయారు. సెప్టెంబర్ 13 నుంచి అతను సుమారు $19 బిలియన్ల సంపదను కోల్పోయారు. ఫేస్‌బుక్‌ స్థాపించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం మీద ఇంత సమయం పాటు సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్‌లో డ్యామేజ్‌ జరగడం ఇదే మొదటిసారి.

ఇక ఫేస్‌బుక్‌ అనుబంధ సర్వీసులు ఆగిపోవడంపై యూజర్ల అసహనం, ఇంటర్నెట్‌లో సరదా మీమ్స్‌తో పాటు రకరకాల ప్రచారాలు సైతం తెర మీదకు వచ్చాయి. ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ‘నెగెటివ్‌’ కథనాల ప్రభావం వల్లే ఇలా జరిగి ఉంటుందని, కాదు కాదు ఇది హ్యాకర్ల పని రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇది సాంకేతికపరమైన సమస్యే అని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here