ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ 5.5 కోట్ల యూజర్లకు శుభవార్త అందించింది. తక్కువ ఆదాయం గల తమ యూజర్ల కోసం ఈ కరోనా మహమ్మరి సమయంలో ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చినట్లు ఆదివారం ప్రకటించింది. రూ.270 కోట్ల విలువైన ప్రయోజనాలు ఈ మహమ్మారి సమయంలో సహాయపడటానికి తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. అర్హత కలిగిన వినియోగదారులకు ₹49 ప్యాక్ ను ఈ కాలంలో ఉచితంగా ఇవ్వనున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ ప్యాక్ 28 రోజుల వాలిడిటీతో రూ.38 టాక్ టైమ్, 100ఎంబి డేటాతో వస్తుంది.(ఇది కూడా చదవండి: గాజాపట్టీ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను రక్షిస్తున్న ఉక్కు గొడుగు)

ఈ స్పెషల్ ఆఫర్ వల్ల సుమారు 55 మిలియన్ల తక్కువ ఆదాయం గల వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది అని సంస్థ పేర్కొంది. అలాగే, ఎంపిక చేయబడ్డ రీఛార్జ్ ప్లాన్ పై డబుల్ బెనిఫిట్ ని ఆఫర్ చేస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. “ఈ సమయంలో ప్రజలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటానికి ఎక్కువ అవసరం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని, ₹79 రీఛార్జ్ కూపన్ కొనుగోలు చేసే ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ కస్టమర్ లు ఇప్పుడు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతారు. ఇది కష్ట సమయంలో వారికి తోడుగా ఉంటుందని” కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయోజనాలు వచ్చే వారంలో ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి అని చెప్పింది.

కరోనా మహమ్మారి, లాక్డౌన్ ల కారణంగా ఎయిర్‌టెల్‌ గత ఏడాది కూడా తక్కువ ఆదాయం ఉన్న వినియోగదారులకు ఇలాంటి ప్రయోజనాలను ప్రకటించింది. ఈ ప్రయోజనాల్లో ప్రీపెయిడ్ వాలిడిటీని పొడిగించడం, 10 రూపాయలు క్రెడిట్ చేయడం వంటివి ఉన్నాయి. అలాగే, కంపెనీ తన ఎయిర్‌టెల్‌ థాంక్స్ యాప్ ఎక్స్ ప్లోర్ విభాగంలో రెండు కొత్త సబ్ సెక్షన్ లను జత చేసింది. మొదటి ఆప్షన్ ని ‘కోవిడ్ సోస్(Covid SoS)’ అని పిలుస్తారు. దీని ద్వారా ఔషధాలు, ఆక్సిజన్ లభ్యత, ప్లాస్మా దాతలు, అంబులెన్స్ లు, ఆసుపత్రి బెడ్ లు, టెస్టింగ్ సెంటర్ లు వంటి సమాచారం లభిస్తుంది. ఇక రెండవ కోవిన్-19 సెక్షన్ ద్వారా వినియోగదారులు వ్యాక్సినేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు అని తెలిపింది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here