ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న ఏలోన్ మస్క్ సంపాదన రోజు రోజుకి తరిగిపోతుంది. తాజాగా విడుదల చేసిన బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ ప్రపంచ ధనవంతుల జాబితాలో రెండవ స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయారు. ఇప్పుడు రెండవ స్థానంలోకీ ఎల్విఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ వచ్చి చేరారు. గత వారం గ్లోబల్ స్టాట్ ఆఫ్ టెక్నాలజీ స్టాక్స్ తర్వాత టెస్లా షేర్లు బాగా పడిపోయాయి. ప్రస్తుతం షేర్ మార్కెట్లో క్రీప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ ధర భారీగా పడిపోయి 42,185 డాలర్లకు చేరుకుంది.

ఫిబ్రవరి 5 తర్వాత ఇంత తక్కువకు చేరుకోవడం ఇదే మొదటి సారి. ఫిబ్రవరి 5న బిట్ కాయిన్ ధర 34,085 డాలర్లు పలికింది. దీంతో డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్లపై భారీగా పెట్టుబడులు పెట్టిన ఏలోన్ మస్క్ సంపాదన కూడా అంతే స్థాయిలో తగ్గింది. ఏప్రిల్ 13న 63,588 డాలర్లుగా ఉన్న బీట్ కాయిన్ ధర ప్రస్తుతం 34,085 డాలర్లకు పడిపోయింది. మార్చిలో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచికలో అగ్రస్థానంలో ఉన్న ఏలోన్ మస్క్ సంపద 160.6 బిలియన్ డాలర్ల(24 శాతం తగ్గి)కు చేరుకుంది. ఇలా చిన్న ట్విట్స్ వల్ల ఈ ఏడాదిలో 9 బిలియన్ డాలర్ల(65 వేల కోట్ల)కు పైగా కోల్పోయినట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది.(ఇది కూడా చదవండి: 20 ఆవులతో రూ.44 కోట్లు సంపాదిస్తున్న ఐఐటీ విద్యార్థి)
ఇంతల డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ల ధర తగ్గడానికి కారణం కూడా ఏలోన్ మస్క్ చేసిన ట్విట్స్. మే 13న తమ కార్ల సంస్థ టెస్లా ఇకపై డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్లను చెల్లింపుగా అంగీకరించట్లేదని ట్వీట్ ద్వారా తెలిపాడు. ఇక ఏముంది అంతే ఒక్కసారిగా వాటి షేర్ల ధర ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. మస్క్ బిట్ కాయిన్లను ఎందుకు అంగీకరించలేదంటే? బిట్ కాయిన్ల తయారీ కోసం ఫాజిల్ ఫ్యూయల్స్ వాడుతారనే విషయం తెలిసిందే.
అందులో ఎక్కువ శాతం బొగ్గు ఉంటుంది. రకరకాల ఇంధనాల వృథా నుంచి బొగ్గు తయారవుతుంది కాబట్టి అందుకే బిట్‌కాయిన్లను ప్రోత్సహించడం లేదని ట్వీట్‌లో మస్క్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో జెఫ్ బేజోస్ (అమెజాన్), రెండవ స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ (ఎల్విఎంహెచ్ చైర్మన్), మూడవ స్థానంలో ఎలోన్ మస్క్ (టెస్లా, స్పేస్ ఎక్స్) నిలిచారు. ఇక తర్వాత స్థానంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిలిగేట్స్ ఉన్నారు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.