మన సంపాదన పెరిగిన కొద్ది అదే స్థాయిలో పెట్టుబడులు పెరగాలి అంటారు మన పెద్దలు. ఈ కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరికి పొదుపు లేదా పెట్టుబడి విలువ అంటే ఏంటో తెలిసి వచ్చింది. చాలా మంది సామాన్య ప్రజానీకం ఎక్కువగా ఏ భూమి మీదనో, బంగారం మీదనో పొదుపు చేస్తూ ఉంటారు. ఈ రెండూ మంచి రాబడి ఇచ్చే పెట్టుబడి మార్గాలే కానీ, మనం ఆశించినంత వేగంగా రాబడి ఇవ్వవు. మనం ఆశించినంత రాబడి ఇచ్చే ఏదైనా మార్గం ఉంది అంటే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అనే చెప్పుకోవాలి. కానీ, సామాన‍్య జనాలకు ఇది అర్ధం కానీ ఒక క్లిష్టమైన సబ్జెక్ట్.
ఏడాదిలో రూ.42 లక్షలు
మనం గనుక ఒక్కసారి వీటిలో ప్రావీణ్యం సాధించాలే గానీ ఊహించలేని డబ్బులు వస్తాయి. తాజాగా ఒక కంపెనీకి చెందిన షేరును గత ఏడాది క్రితం కొనుగోలు చేసినవారు కేవలం లక్ష పెట్టుబడితో రూ. 42 లక్షలు సంపాదించారు అంటే మీరు నమ్మలేరు కానీ ఇది నిజం. గీతా రెన్యువబుల్ ఎనర్జీ అనే కంపెనీ షేర్ ధర ఏడాదిలో ఎవరు ఊహించలేనంత రీతిలో పెరిగింది. ఈ బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీ షేరు ధర ఒక ఏడాదిలో ₹5.52 నుంచి ₹233.50కు పెరిగింది. అంటే ఏడాదిలో కాలంలో సుమారు 4130 శాతం పెరిగింది అన్నమాట.(చదవండి: ఎయిర్ ఇండియా కొనుగోలు ఒక భారీ కుట్ర)

ఇంకా సులభంగా చెప్పాలంటే మీరు గనుక ఈ గత ఏడాది రూ. 1 లక్ష రూపాయలు విలువ చేసే ఈ కంపెనీ షేర్లు కొని ఉంటే మీరు కేవలం ఏడాదిలోనే రూ.42 లక్షలు సంపాదించేవారు. అందుకే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లలో పెట్టుబడి పెట్టడం తప్పు కాదు. కానీ, దాని మీద ఎటువంటి విషయ పరిజ్ఞానం లేకుండా పెట్టుబడి పెట్టడం ముమ్మాటికి మన తప్పే అవుతుంది. అలాంటి వారు మాత్రమే ఎక్కువ సంఖ్యలో నష్ట పోతున్నారు. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి వీటిలో పెట్టుబడి పెడితే రాత్రికి రాత్రే కుబేరుడు అవ్వచు, నష్టాలు వస్తే బికారీ కూడా అవ్వచ్చు.