ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త..!. ఇక నుంచి గ్యాస్‌ ఎప్పుడు ఖాళీ అవుతుందనే విషయాన్ని తెలుసుకోవడం మరింత సులభతరం కానుంది. అంతేగాకుండా గ్యాస్‌ సిలిండర్ల బరువు కూడా తగ్గనుంది. తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) కొత్తగా స్మార్ట్‌ ఎల్‌పీజీ సిలిండర్లను విడుదల చేసింది. వీటిని ఇండేన్ కాంపోజిట్ సిలిండర్లుగా పిలువనున్నారు. ఈ కొత్త స్మార్ట్ సిలిండర్ల వల్ల వినియోగదారులు తమ తదుపరి గ్యాస్ రీఫిల్‌ను ఎప్పుడు బుక్‌ చేయాలనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం ఐఓసీఎల్‌ విడుదల చేసిన ఈ స్మార్ట్‌ సిలిండర్లతో గ్యాస్‌ ఎంత పరిమాణం ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సాధారణంగా గ్యాస్‌ సిలిండర్లు స్టీల్‌తో చేస్తారు. అయితే, ఐఓసీఎల్‌ విడుదల చేసిన స్మార్ట్‌ సిలిండర్లను హై-డెన్సిటీ పాలిథిలిన్(హెచ్‌డీపీఈ)తో తయారుచేశారు. ఈ సిలిండర్లు చుట్టూ ఉండే మూడు లేయర్ల నిర్మాణం వల్ల ఇవి స్టీల్‌ సిలిండర్లు మాదిరి స్మార్ట్‌ సిలిండర్లు ధృడంగా ఉంటాయని ఐఓసీఎల్‌ పేర్కొంది.

ఇండేన్ కాంపోజిట్ కొత్త సిలిండర్ ప్రత్యేకతలు:

  • సాదారణ సిలిండర్ల కంటే ఈ సిలిండర్లు చాలా తేలికైనవి. ప్రస్తుతం ఉన్న సిలిండర్లలో బరువు సగానికిపైగా తగ్గనుంది.
  • ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉంటుంది.
  • వినియోగదారులు సులభంగా రీఫిల్‌ చేసుకోవచ్చు.
  • ఈ కొత్త సిలిండర్లకు తుప్పు పట్టే అవకాశం ఉండదు.
  • తర్వాత తరానికి తగ్గట్టు ఆధునిక పద్దతుల్లో దీన్ని డిజైన్‌ చేశారు.
  • ఈ స్మార్ట్ సిలిండర్లు న్యూఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, ఫరీదాబాద్, లూధియానాలలో అందుబాటులో ఉన్నాయి.
  • వినియోగదారుల సౌకర్యం కోసం 5 కేజీల నుంచి 10 కేజీల పరిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి.
  • త్వరలో ఈ సిలిండర్లు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని ఐఓసీఎల్ ప్రకటించింది.

ప్రస్తుతం ఉన్న ఎల్‌పిజి స్టీల్ సిలిండర్లకు బదులు ఈ స్మార్ట్‌ సిలిండర్లను మార్చుకునే సౌకర్యం ఉంది. ఇందుకోసం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ లేని ఈ స్మార్ట్ సిలిండర్లకు సెక్యూరిటీ డిపాజిట్ కింద 10 కిలోల బరువు సిలిండర్‌ కు రూ.3350, 5 కిలోల బరువున్న సిలిండర్‌కు రూ.2150 చెల్లించాల్సి ఉంటుంది.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here