Saturday, April 20, 2024
HomeBusinessఅప్పుడు ఎకరం రూ.40 లక్షలు..! ఇప్పుడు రూ.3 కోట్లు..!

అప్పుడు ఎకరం రూ.40 లక్షలు..! ఇప్పుడు రూ.3 కోట్లు..!

పెద్దలు ఊరికే ఏది చెప్పరూ, ప్రతి దాని వెనుక పెద్దలు ఊరికే ఏది చెప్పరూ, ప్రతి దాని వెనుక ఏదో ఒక అర్ధం ఉంటుంది. మనం సంపాదించే కొంత మొత్తాన్ని ఏదైనా రాబడి ఇచ్చే వాటి పెట్టుబడి మీద పెట్టాలని చూస్తున్నారు. కరోనా మహమ్మారి పుణ్యమా అని ప్రతి ఒక్కరికి ఈ విషయం సులభంగా అవగతం అయ్యింది. తెలంగాణలో అక్కడ భూములు కొన్నవారి పంట పండుతుంది. త్వరలో రాబోతున్న రీజినల్‌ రింగ్‌ రోడ్‌(ఆర్‌ఆర్‌ఆర్‌-త్రిబుల్‌ ఆర్‌)వల్ల ఆయా చుట్టూ పక్కల భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్‌-చేవెళ్ల రహాదారికి ఇరువైపులా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

(ఇది చదవండి: యాపిల్‌ అదిరిపోయే ఫీచర్‌.. అచ్చం చిత్రలహరిలో సినిమాలో చెప్పినట్టే!)

ప్రస్తుతం 2 లైన్ల రహదారి కాస్త నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయనుండటంతో భూమి ధరలు వృద్ధి చెందాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. గతంలో ఎకరం రూ.40-60 లక్షలు ఉన్న భూమి.. ఇప్పుడది రూ.2.5-3 కోట్లు పలుకుతున్నట్లు తెలిపారు. ప్రతిపాదిత 340 కి.మీ. ఆర్‌ఆర్‌ఆర్‌ వల్ల పూడుర్‌ మండలంలోని చాంగోమూల్‌ గ్రామంలో ఎన్‌హెచ్‌163 వద్ద కలుస్తుంది. తూప్రాన్, చౌటుప్పల్, ఆమన్‌గల్, శంకర్‌పల్లి, సంగారెడ్డి పట్టణాల కలిపే నాలుగు లైన్లతో కూడిన రహదారి త్రిబుల్‌ ఆర్‌తో అనుసంధానమవుతాయని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ప్రతిపాదించింది. దీంతో ఆయా ప్రాంతాలలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles