కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తాజాగా వినియోగదారుల క్లెయిమ్స్ ప్రక్రియ విషయంలో కాస్త ఊరట కలిగించింది. క్లెయిమ్స్ సెటిల్మెంట్ నిబంధనలను కొంత మేరకు సడలించింది. ఈ కరోనా కాలంలో డెత్‌క్లెయిమ్స్‌కి సంబంధించి పాలసీదారు ఆస్పత్రిలో మరణిస్తే మున్సిపల్ డెత్ సర్టిఫికెట్ కాకుండా ప్రత్యామ్నాయంగా ఇతరత్రా రుజువులైనా సమర్పించవచ్చని ఎల్‌ఐసీ పేర్కొంది.(ఇంకా చదవండి: వాహనదారులకు శుభవార్త అందించిన కేంద్రం!)
డెత్ సర్టిఫికెట్ ను కార్పొరేట్ ఆస్పత్రులు, సాయుధ బలగాలు , ఈఎస్‌ఐ, ప్రభుత్వం జారీ చేసే డిశ్చార్జ్ సమ్మరీ ఎల్‌ఐసీ క్లాస్ 1 అధికారులు లేదా 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన డెవలప్‌మెంట్ ఆఫీసర్లు సంతకం చేసిన వాటిని పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. వీటిపై మరణించిన తేదీ, సమయం, పేరు, కచ్చితంగా స్పష్టంగా ఉండాలి. ఖనన, దహనాలకు సంబంధించిన సర్టిఫికెట్ వీటితో పాటు జతచేయాలని ఒక ప్రకటనలో ఎల్‌ఐసీ పేర్కొంది. ఇతర వాటి విషయంలో యథా ప్రకారం మున్సిపల్ మరణ దృవీకరణ పత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా ఎల్‌ఐసి తన వినియోగదారుల కోసం ఆన్‌లైన్ నెఫ్ట్ ట్రాన్స్‌ఫర్‌లను కూడా చేయనున్నట్లు వివరించింది. కోవిడ్ నేపథ్యంలో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా వినియోగదారుల సమస్యలను పరిష్కరించనుంది. ఇక మే 10 నుంచి ఎల్ఐసీ కార్యాలయాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య పనిచేయనున్నాయి. ప్రతి శనివారం,ఆదివారాలు దేశవ్యాప్తంగా ఉన్న సెలవు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.