నిత్యావసర సరుకుల కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ఈ కరోనా మహమ్మారి కష్ట కాలంలో ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఫ్యూచర్ గ్రూపుకు చెందిన రిటైల్ చైన్ దిగ్గజం బిగ్ బజార్ గుడ్ న్యూస్ తెలిపింది. తన వినియోగదారుల కోసం బిగ్ బజార్ 2021 మే 22 నుంచి మే 31 వరకు ‘బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ పేరిట ప్రత్యేకంగా ఒక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద రూ.1500 షాపింగ్ చేసిన వారికి రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు పేర్కొంది.(ఇది కూడా చదవండి: పబ్జీ(బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా) ప్రియులకు చేదువార్త)
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అనేక రాష్ట్రాలు పాక్షిక లాక్‌డౌన్ / పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్న కారణంగా బిగ్ బజార్ వినియోగదారులు ఇంట్లో నుంచే బిగ్ బజార్ ఆన్‌లైన్ యాప్‌లో ఆర్డర్ బుక్ చేయడం ద్వారా కూడా ఈ ఆఫర్‌ను పొందగలరు. అలాగే, మీ దగ్గరలోని బిగ్‌బజార్‌లో స్టోర్ షాపులో షాపింగ్ చేయడం ద్వారా కూడా పొందవచ్చు. బిగ్ బజార్ ఆన్‌లైన్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన వాటిపై రూ.1000 క్యాష్‌బ్యాక్ తో పాటు, బుక్ చేసిన 2 గంటలలో హోమ్ డెలివరీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది.
“నిత్యావసర సరుకుల కోసం మీరు ఇంట్లో నుంచి ఆన్‌లైన్ యాప్ ద్వారా షాపింగ్ చేసిన లేదా కరోనా మార్గదర్శకాల ప్రకారం మీ దగ్గరలోని షాపింగ్ స్టోర్ ద్వారా సరుకులు కొనుగులు చేసిన ఆఫర్ వర్తిస్తుంది” అని ఫ్యూచర్ గ్రూప్ గ్రూప్ సీఎమ్ఓ, పవన్ సర్దా అన్నారు. దేశవ్యాప్తంగా 150కి పైగా నగరాల్లో స్టోర్స్ కలిగి ఉన్న బిగ్ బజార్ అనేది ఫ్యూచర్ గ్రూప్ చెందింది. ఇంటరాక్టివ్ డిజిటల్ స్క్రీన్లు, సిట్-డౌన్ చెక్ అవుట్స్, స్మార్ట్ కస్టమర్ సర్వీస్ వంటి ఆవిష్కరణలతో ఉన్నతమైన షాపింగ్ అనుభవాలను బిగ్ బజార్ అందిస్తుంది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.