Ola Electric Scooter: ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు శుభవార్త. ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఓలా గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెలలోనే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను దేశీయ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కంపెనీ రూ.2,400 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా తమిళనాడులో గిగా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ ఫ్యాక్టరీ పూర్తిగా అందుబాటులోకి వచ్చాక సుమారు 10,000 కొత్త ఉద్యోగాలను సృష్టించనున్నట్లు పేర్కొంది. ప్రపంచంలోనే ఏడాదికి 2 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసే అతిపెద్ద ఈ-స్కూటర్ కంపెనీగా ఓలా మారనుంది.
ఓలా చైర్మన్, గ్రూప్ సీఈఓ భావిష్ అగర్వాల్ కొద్ది రోజుల క్రితమే కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల చేశారు. ఈ వీడియోలో భావిష్ అగర్వాల్ ఆ స్కూటర్ మీద బెంగళూరు విదుల్లో తిరిగారు. అలాగే, జూన్ నుంచి ఈ కర్మాగారం పనిచేస్తోందన్నారు. ఈ-స్కూటర్ జూలైలో మార్కెట్లోకి వస్తుందని చెప్పారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను భవిష్యత్ ప్రపంచ అవసరాల కోసం మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రజలు ఎలక్ట్రానిక్ వాహనాలపై ఎక్కువ అధారపడతరని అన్నారు. ఛార్జింగ్ సమస్యల పరిష్కారం కోసం 400 నగరాల్లో సుమారు 1 లక్ష ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుననట్లు తెలిపారు.

5,000 ఛార్జింగ్ పాయింట్లు
మొదటి ఏడాదిలో దేశంలోని100 నగరాల్లో 5,000 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కంపెనీ పెట్టుకుంది. ఈ స్కూటర్ కు 18 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ పూర్తవువుతంది. దీంతో 75 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. ఒక సారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 150 కిలో మీటర్ల వరకు ప్రయాణించవచ్చు, గంటకు 90 కిలో మీటర్ల వేగంతో దీనిపై ప్రయాణించవచ్చు. వినియోగదారుల సౌకర్యం కోసం ఛార్జింగ్ స్టేషన్లును టవర్లు, మాల్స్, ఐటీ పార్కులు, కార్యాలయాలు, కాంప్లెక్స్ల వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఓలా ఎలక్ట్రిక్ యాప్ ద్వారా ఛార్జింగ్ పాయింట్ల గురించి సమాచారం తెలుసుకోవచ్చు.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.