రోజు రోజుకి భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బంకుకు వెళ్లిన ప్రతిసారి సామాన్యుడు జోబులు తడుముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేడు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. చమురు ధరలు వరుసగా నాల్గవ రోజు అంటే అక్టోబర్ 8న పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 30 పైసలు పెరగడంతో రూ.103.24 నుంచి ₹103.54కు చేరుకుంటే, డీజిల్ రేటు లీటరు 35 పైసలు పెరగడంతో రూ.91.77 నుంచి ₹92.12కు పెరిగినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.
ముంబైలో చమురు ధరలు సవరించిన తర్వాత పెట్రోల్ ధర లీటరుకు ₹109.54, డీజిల్ లీటరుకు ₹99.22. విలువ ఆధారిత పన్ను లేదా వ్యాట్ కారణంగా ఇంధన రేట్లు రాష్ట్రాల్లో వేరు వేరుగా ఉంటాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ చమురు శుద్ధి కర్మాగారాలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలను, రూపాయి డాలర్ల మారకం రేట్లను పరిగణనలోకి తీసుకొని ఇంధన రేట్లను రోజువారీగా సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. చమురు కంపెనీలు కూడా పెట్రోల్, డీజిల్ తక్కువ ఉత్పత్తి చేయడంతో ధరలు పెరిగినట్లు నిపుణులు తెలుపుతున్నారు.(చదవండి: ఏపీలో రేషన్ కార్డు దారులకు అలర్ట్.. వారికి రేషన్ బంద్!)
దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
City Name | Petrol Price | Diesel Price |
హైదరాబాద్ | 107.73 | 100.51 |
విజయవాడ | 109.62 | 101.86 |
ఢిల్లీ | 103.54 | 92.12 |
ముంబై | 109.54 | 99.22 |
చెన్నై | 101.01 | 96.60 |
కోల్‌కతా | 104.23 | 95.23 |