బ్యాంకు ఖాతాదారులకు ఆర్‌బీఐ భారీ షాక్ ఇచ్చింది. ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్(ఏటిఎం) లావాదేవీలపై బ్యాంకులు ఇంటర్‌ఛేంజ్ ఫీజును వసూలు చేసుకోవచ్చు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీంతో బ్యాంక్ ఖాతాదారులపై మరీ ముఖ్యంగా ఏటీఎం లావాదేవీలు నిర్వహించే వారిపై మరింత భారం పడనుంది. ఇంటర్‌ఛేంజ్ చార్జీల పెంపు వల్ల బ్యాంకుల ఆర్ధిక లావాదేవిలపై రూ.17 వరకు రుసుమును వసూలు చేసుకోవచ్చు అని తెలిపింది. గతంలో ఈ ఫీజు రూ.15గా ఉండేది. ఇంకా ఆర్ధికేతర లావాదేవీలపై చార్జీలను రూ.5 నుంచి రూ.6కు పెంచింది.
ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత కస్టమర్లు చేసే ఏటీఎం లావాదేవీలపై ఇప్పటి వరకు విధించే ఫీజు రూ.20 నుంచి రూ.21 బ్యాంకులు గరిష్టంగా వసూలు చేసుకోవచ్చు. ఆర్ధిక లావాదేవిలపై విధించే ఫీజు పెంపు నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమలులోకి వస్తే ఆర్ధికేతర లావాదేవీలపై ఫీజు పెంపు 2021 ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఇంటర్‌ఛేంజ్ ఫీజు అంటే? మీరు వేరే బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకున్నప్పడు మీ బ్యాంక్ వేరే ఏటీఎం బ్యాంక్‌కు డబ్బులు చెల్లించాలి. దాన్నే ఇంటర్‌ఛేంజ్ ఫీజు అని అంటారు.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.