కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశాన్ని ఆదుకునేందుకు ఆసియా బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ముందుకు వచ్చారు. కరోనా మహమ్మారి నివారణ కోసం కొత్త ఔషధాన్ని తీసుకొచ్చే ప్రయత్నం రిలయన్స్ చేస్తుంది. అలాగే తక్కువ ధరలో కరోనా టెస్టింగ్ కిట్‌ను కూడా లాంచ్ చేయనుంది. కోవిడ్-19 మహమారి నివారణ కోసం నిక్లోసామైడ్(టేప్‌వార్మ్ డ్రగ్) అనే ఔషధాన్ని రియలన్స్ ముందుకు తీసుకు రానుంది. రిలయన్స్ తయారు చేసిన డయాగ్నొస్టిక్ కిట్లు – ఆర్-గ్రీన్, ఆర్-గ్రీన్ ప్రో లకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నుంచి అనుమతి లభించింది.(ఇది కూడా చదవండి: కరోనా: మార్కెట్లో ఉన్న మంచి పల్స్ ఆక్సీమీటర్లు)
అంతేకాకుండా మార్కెట్ ధరలతో పోలిస్తే ఐదవ వంతు తక్కువ ధరకే శానిటైజర్లను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఖరీదైన టెస్టింగ్ కిట్స్, ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్న లక్షల కొద్దీ బిల్లులతో భయపడుతున్న ప్రజలకు రిలయన్స్ ప్రయత్నాలు కొంత మేరకు ఊరట నివ్వనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయం. దేశీయ ఆసుపత్రులను ప్రధానంగా వేధిస్తున్న వెంటిలేటర్ల కొరతను తీర్చడానికి మరింత కృషి చేస్తుంది. ఇందుకుగాను రిఫైనింగ్-టు-రిటైల్ గ్రూప్ 3డీ టెక్నాలజీ “స్పెషల్ స్నార్కెలింగ్ మాస్క్” వినియోగిస్తోందని బ్లూం బర్గ్ పేర్కొంది.
అలాగే, నిమిషానికి 5-7 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగిన గ్రేడ్ ఆక్సిజన్ జనరేటర్లను కూడా తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఒక్క మాటలో చెప్పాలంటే కరోనా మహమ్మారి యుద్దం ప్రకటించింది అని చెప్పుకోవాలి. గత ఏడాది పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.500 కోట్లు, మహారాష్ట్ర, గుజరాత్ సీఎం రిలీఫ్ ఫండ్కు కోటి రూపాయల విరాళం ప్రకటించింది. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 875 పడకలను అందించింది. సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా మెడికల్-గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాకు రిలయన్స్ తన వంతు సామాజిక భాద్యతను నిర్వహిస్తుంది.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.