ఎయిర్‌టెల్ ఇప్పటి వరకు వచ్చిన ఎన్నో సంక్షోభాలను తట్టుకుని నిలబడడమే కాదు, వృద్ది చెందుతుందని ఆ సంస్థ అధినేత సునీల్ భారతీ మిట్టల్ అన్నారు. గతంలో వచ్చిన మూడు, నాలుగు పెద్ద సంక్షోభాలను తట్టుకుని ఇప్పుడు ఒక పటిష్టమైన స్థితికి కంపెనీ చేరుకుందన్నారు. అమెజాన్ సంభవ్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా టెలికం పరిశ్రమపై జియో వేసిన ముద్ర, దేశ భవిష్యత్తుపై ఆయన తన అభిప్రాయాలను ఈ వేదికగా పంచుకున్నారు. (ఇది కూడా చదవండి: ఛార్జింగ్ అక్కర్లేని ఎలక్ట్రిక్ కారు.. ధర కూడా తక్కువే!)
‘‘గతంలో 2016లో జియో ఆవిష్కరణ పేరుతో ఒక అతిపెద్ద సంక్షోభం వచ్చింది. భారతీయ మార్కెట్లో అది ఒక అత్యంత శక్తివంతమైన పోటీదారు. ఏడాది పాటు ఉచిత సేవలు, తదుపరి ఏడాది పాటు రాయితీ సేవలు, మార్కెట్‌ను కొల్లగొట్టే టారిఫ్‌లు, సబ్సిడీ ఫోన్లు.. వీటన్నింటి ఫలితంగా మొత్తం 12 ఆపరేటర్లలో 9 ఆపరేటర్లు తట్టా, బుట్టా సర్దుకున్నాయి. మరికొన్ని ఇతర కంపెనీలతో విలీనం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ, ఎయిర్‌టెల్ మాత్రం ఈ సంక్షోభాన్ని ఎదుర్కొని నిలబడింది. నేడు ముగ్గురు ప్రైవేటు ఆపరేటర్లే మిగిలారు” అని సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.