Reliance-Jio

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కొద్ది రోజుల క్రితం టారిఫ్‌ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారి బాటలోనే టారిఫ్‌ రేట్లను పెంచుతూ జియో సంచలన నిర్ణయం తీసుకుంది. సుమారు 20 శాతం మేర ప్లాన్‌ ధరలను జియో పెంచింది. పెరిగిన టారిఫ్‌ ప్లాన్ల రేట్లు డిసెంబర్‌ 1 నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు రూ.75గా ఉన్న జియోఫోన్‌ బేసిక్ ప్లాన్‌ రూ. 91కి పెరిగింది.

(చదవండి: ఆహా ఏమి అదృష్టం! పెట్టుబడి లక్ష.. లాభం రూ.35 లక్షలు..!)

ఆయా ప్లాన్స్ బట్టి సుమారు రూ.24 నుంచి రూ.480 మేర ధరలు పెరిగాయి. టెలికాం సర్వీసులను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో అపరిమిత ప్లాన్‌ రేట్లను పెంచుతున్నట్లు జియో ఒక ప్రకటనలో పేర్కొంది. టెలికాం పరిశ్రమలో ఈ కొత్త టారిఫ్‌ ప్లాన్స్‌ అత్యుత్తమ ప్లాన్స్‌గా నిలుస్తాయని జియో వెల్లడించింది.

జియో కొత్త ప్లాన్స్‌ ఇలా ఉన్నాయి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here