ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన జియోఫోన్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. జియోఫోన్‌ ప్రీపెయిడ్‌ యూజర్లు కళ్లు చెదిరేలా ‘బై వన్‌ గెట్‌ ఫ్రీ వన్‌’ ఆఫర్లను ప్రకటించింది. ఉదాహరణకు జియో ఫోన్‌ యూజర్లు ఒక ప్లాన్ కింద వారికి 3 జీబీ డేటా లభిస్తే ఇప్పుడు ఉచితంగా అంతే 3 జీబీ డేటా అనేది లభిస్తుంది. ప్రస్తుతం జియోఫోన్‌ యూజర్లకు రూ.39,రూ.69,రూ.75,రూ.125 రూ.155,రూ.185 రీఛార్జ్‌ ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

జియో రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఆఫర్స్:

  • రూ.39 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌ తో పాటు 14 రోజుల పాటు 100 ఎంబీ డేటా లభిస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా మరో 14రోజుల పాటు ఉచితంగా 100 ఎంబీ డేటాను అదనంగా పొందవచ్చు.
  • రూ.69 ప్లాన్ రీఛార్జ్‌ చేసుకుంటే అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌ తో పాటు 14 రోజుల పాటు ప్రతీ రోజు 0.5 జీబీ డేటాను పొందవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా మరో 14 రోజుల పాటు ఉచితంగా 1 జీబీ డేటాను అదనంగా పొందవచ్చు.
  • రూ.75 ప్లాన్ రీఛార్జ్‌ చేసుకుంటే అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌ తో పాటు 28 రోజుల వ్యాలిడిటీతో 3 జీబీ డేటాను పొందవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా 6జీబీ డేటాను పొందవచ్చు.
  • రూ.125 ప్లాన్ రీఛార్జ్‌ చేసుకుంటే అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌ తో పాటు 28 రోజుల వ్యాలిడిటీతో 0.5 జీబీని పొందవచ్చు. ఆఫర్‌లో భాగంగా ప్రతి రోజు 1జీబీ డేటాను పొందవచ్చు.
  • రూ.155 ప్లాన్ రీఛార్జ్‌ చేసుకుంటే అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ 28 రోజుల వ్యాలిడిటీతో 1జీబీ డేటాను అందిస్తుండగా అదనంగా రోజుకు 2జీబీ డేటాను అదనంగా పొందవచ్చు.
  • రూ.185 ప్లాన్ రీఛార్జ్‌ చేసుకుంటే అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజు 2జీబీ డేటాను అందిస్తుండగా ఆఫర్‌లో భాగంగా ప్రతి రోజు 4జీబీ డేటాను పొందవచ్చు అని రిలయన్స్‌ జియో ప్రకటించింది.

Support Tech Patashala