మొబైల్ రీఛార్జ్‌ ధరలు భారీగా పెరగనున్నాయా అంటే? అవును అనే సమాధానం వినిపిస్తుంది. టెలికాం రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ పేర్కొన్నారు. ఈ ఒత్తిడి నుంచి బయటపడాలంటే టారిఫ్‌లు పెంచడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. రిచార్జీల ధరలు పెంచే ఆలోచనలో ఎయిర్‌టెల్‌ ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఇది ఏకపక్షంగా ఒకరు మాత్రమే చేయలేమని వెల్లడించారు.

తాజాగా టెలికం టారిఫ్‌లపై సునీల్‌ మిట్టల్‌ మాట్లాడుతూ… ‘ఒకరినొకరు చంపడం ఎంతకాలం కొనసాగించగలం. చాలా కంపెనీలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాయి. టారిఫ్‌లను పెంచడం మనదేశంలో ఎల్లప్పుడూ చేడుగా అనిపిస్తుంది. ప్రభుత్వం, అధికారులు, టెలికం శాఖ ప్రస్తుత సమస్యపై దృష్టిపెట్టాలి. మీరు తీసుకునే నిర్ణయలే భారత డిజిటల్‌ కల చెక్కుచెదరకుండా ఉంటుంది. భారతి ఎయిర్‌టెల్‌ ఈక్విటీ, బాండ్ల ద్వారా సమయ అనుకూలంగా తగినంతగా నిధులను సేకరించింది. రాబోయే సంవత్సరాల్లో మార్కెట్‌కు సేవ చేయడానికి కంపెనీ బలంగా ఉంది’ అని వివరించారు.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.