• జూన్‌లో 3-4% పెరిగే అవకాశం
  • ప్యానళ్ల ధరలు, లాజిస్టిక్స్‌ వ్యయాలు,పెరగడమే కారణం
  • పెంపు యోచనలో ప్యానసోనిక్‌, హయర్‌ తదితర బ్రాండ్లు

అంతర్జాతీయ మార్కెట్లో ప్యాన్ల రేట్లతో పాటు లాజిస్టిక్స్‌ వ్యయాలు పెరగడంతో ఎల్‌ఈడీ టీవీల ధరలు మరోసారి పెరగనున్నాయి. జూన్‌లో 3-4 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్యానసోనిక్‌, హయర్స, థామ్సన్‌ తదితర బ్రాండ్‌లు ఎల్‌ఈడీ ధరల పెంపు యోచనలో ఉన్నాయి. “కమోడిటీల రేట్ల పెరుగుదలతో… కొన్ని ఉత్పత్తుల ధరలను సుమారు 3-4 శాతం పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నాం” అని ప్యానసోనిక్‌ ఇండియా ప్రెసిడెంట్ మనీష్‌ శర్మ తెలిపారు. “ప్యానళ్ల ధరలు పెరిగిపోయాయి. ధరలను పెంచడం తప్ప ఎవరికీ ఇకవేరే అవకాశం లేదు. భారత్‌లో ఎక్కువగా అమ్ముడయ్యే 32 అంగుళాల టీవీలతో పాటు 42 అంగుళాల పెద్ద సైజు స్కీన్‌ ప్యాన్ల రేట్లు పెరిగాయి. ధరల పెంపు విషయంలో తయారీ సంస్థలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది” అని హయర్‌ అప్లయెన్సెస్‌ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్‌ బ్రగాంజా తెలిపారు.

జూన్‌ 20 నుంచి తమ సంస్థ కూడా 3-4% మేర రేట్లను పెంచవచ్చని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తమ టీవీల ధరలను రూ.1.000-2000 దాకా పెంచవచ్చని సూపర్‌ ప్లాస్తానిక్స్‌ (ఎస్‌పీపీఎల్) సీఈవో అవనీత్‌ సింగ్‌ మార్వా చెప్పారు. “అంతర్జాతీయంగా, దేశీయంగా రవాణా చార్జీలు ఆల్‌టైం గరిష్ట స్థాయిలో ఉన్నాయి. వీటితో పాటు ప్యానెళ్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. 40 అంగుళాల స్కీన్‌లకు సంబంధించి ఓపెన్‌ సెల్‌ ధరలు దాదాపు 3% పెరిగాయి” అన్నారు. టీవీ యూనిట్‌లో ఓపెన్‌ సెల్స్‌ కీలకమైనవి. టీవీ తయారీ వ్యయంలో దాదాపు 70 శాతం వాటా వీటిదే ఉంటుంది. చాలా మటుకు తయారీ సంస్థలు వీటిని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.

మూడు నెలల్లో రెండోసారి

‘చైనాలోని’షెంజెన్‌ నుంచి దేశీయంగా నావా షేవా పోర్టుకుసముద్ర మార్గం ద్వారా ఓ కంటెయినర్‌ రావాలంటే ఖర్చులు 4,200 డాలర్ల దాకా ఉంటోంది. ఏడాదిన్నర క్రితం ఇది కేవలం 600 డాలర్లుగా ఉండేది” అని మార్వా వివరించారు. మూడు నెలల్లో రెండోసారి… గడిచిన మూడు నెలల్లో టీవీల రేట్లను తయారీ సంస్థలు పెంచడం ఇది రెండోసారి కానుంది. సముద్ర రవాణా చార్జీలు, దేశీయంగా రవాణా వ్యయాలు ఎగియడంతో నిర్వహణ ఖర్చులు పెరిగి పోయాయనే కారణంతో ఏట్రిల్‌లోనే ధరల పెంచాయి.

కస్టమ్స్‌ డ్యూటీ పెంపు

దాదాపు ఏడాది పాటు ఓపెన్‌ సెల్‌ దిగుమతులకు సుంకాల నుంచి మినహాయింపునిచ్చిన కేంద్రం గతేడాది అక్షోబర్‌ 1 నుంచి 5 శాతం కస్టమ్స్‌ డ్యూటీని తిరిగి అమల్లోకి తెచ్చింది. అంతేగాకుండా దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు టీవీల దిగుమతులను అంక్షలు అమలయ్యే కేటగిరీలోకి మార్చింది. ఉపకరణాలు, కన్ధూమర్‌. ఎలక్రానిక్స్‌ విభాగంలో పెద్ద సెగ్మెంట్‌లో టీవీలు కూడా ఉంటాయి. వీటి అమ్మకాల విలువ దాదాపు రూ. 5,000 కోట్ల దాకా ఉంటుందని అంచనా. పరిశ్రమ సమాఖ్య సీఈఏఎంఏ, ఫ్రాస్ట్‌ అండ్‌ సలివాన్‌ నివేదిక ప్రకారం 2018-19లో 175 లక్షల యూనిట్లుగా ఉన్న టీవీల మార్కెట్‌ 208-255 నాటికి 284 లక్షల యూనిట్లకు చేరనుంది.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.