డ్రైవర్లు లేని కార్లు తయారు చేసినా.. హైపర్‌ లూప్‌తో రవాణా తీరు తెన్నులను మార్చేస్తానన్నా! అంగారకుడిపై మానవ కాలనీని ఏర్పాటు చేస్తానన్నా.. సంచలనాలకు పెట్టింది పేరు.. ఎలన్‌ మస్క్‌. అలాంటి మస్క్‌ ఇప్పుడు కృత్రిమ మేధతో కూడిన రోబోను తయారు చేస్తున్నారు. ‘టెస్తాబోట్‌గా పిలిచే ఈ రోబో ప్రాథమిక నమూనాను కూడా ఆవిష్కరించారు. అ వివరాలు గురుంచి తెలుసుకుందామా?

యాంత్రికంగా మళ్లీ మళ్లీ చేసే పనులను రోబోలకు అప్పగించేస్తే.. మనం అంతకంటే పనులు చేసుకోవచ్చన్నది చాలా కాలంగా ఉన్న ఆలోచనే. చాలా వరకు పరిశ్రమలలో ఇప్పటికే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. కానీ మంచి చిత్రం.. సంగీతం ఏదైనా అలోచించి చేయగలిగిన పనుల్లో మనిషిలా మేధస్సుతో వ్యవహరించగల రోబోలు ఇప్పటివరకు తయారు కాలేదు. ఆ దిశగా ప్రయత్నాలు గట్టిగా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఎలన్‌మస్క్‌ కృత్రిమమేధ సాయంతో మానవులను పోలిన(హ్యూమనాయిడ్‌) రోబోను తయారుచేస్తానని ప్రకటించడం సంచలనం రేపుతోంది. ”టెస్లాబోట్‌ మనుషుల కోసం నిర్మించిన ప్రపంచంలోనే తిరుగుతూ.. ప్రమాదకరమైన, పదేపదే చేసే బోరింగ్‌ పనులను చక్కబెడుతుంది” అని మస్క్‌ పేర్కొన్నారు.

మనిషి లాగే ఉంది!

ఏలోన్ మస్క్ తయారు చేసిన టెస్లాబోట్‌ ఎత్తు 5.8 అడుగులు, బరువు 5 కిలోలు ఉండనుంది. ముఖం స్థానంలో ఒక తెర ఉంటుంది. అవసరమైన సమాచారం దీనిపై ప్రత్యక్షమవుతుంది. గరిష్టంగా గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో నడవగలదు. నడిచేప్పుడు ఇరవై కేజీల బరువు మోయగలదు. 68 కిలోల బరువును ఎత్తగలదు. ఎనిమిది కెమెరాలు కళ్లుగా పనిచేస్తాయి. టెస్లా కార్లలో ఉపయోగిస్తున్న సెల్ఫ్‌ డ్రైవింగ్‌ సాంకేతికతను, విద్యుత్‌తో పాటు రసాయనాలతో పనిచేసే దాదాపు 40 ఆక్స్ వెటర్లను ఈ రోబోలో ఉపయోగించనున్నారు. ఇది మీరు రోజు చేసే పనులను తేలికగా చేయనున్నట్లు పేర్కొన్నారు.

2022లో మార్కెట్లోకి

అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాదికల్లా టెస్లా బోట్‌ ప్రాథమిక మోడల్‌ సిద్ధమవుతుందని ఎలన్ మస్క్‌ తెలిపారు. ఇది సాధారణమైన పనులన్నీ చేయగలిగే రోబో అని అందుకే మనిషిని పోలీనట్టుగా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. మనిషిని పోలిన ఆకారం వల్ల చక్రాలు, ట్రాక్‌ల కంటే సమర్థంగా ఒకచోటి నుంచి ఇంకోచోటికి వెళ్లగలదని అంచనా వేస్తున్నారు. కృత్రిమ మెదతో పనిచేసే రోబోట్లతో మనుషులకు ప్రమాదకరమని పలుమార్లు ఏలోన్ మస్క్ అభిప్రాయపడ్డారు. అలాంటిది ఆయనే రోబోను తయారు చేస్తుండటం గమనార్హం. దీనిపై ఆయనను వివరణ కోరితే.. ‘టెస్తాబోట్‌కు అలాంటి మేధ ఏమీ ఉండదు. ఒకే రకమైన, పదేపదే చేసే పనులను చేసేందుకే ఇది ఉద్దేశించినది” అని తెలిపారు. టెస్తాబోట్‌లు ఫ్యాక్టరీల్లో పనిచేస్తాయని యూనియన్లు పెట్టవన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here