కరోనా వైరస్‌ మహమ్మారి కష్ట కాలంలో కూడా సేవలు అందించినందుకు గాను టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తమ ఉద్యోగులకు 1,500 (సుమారు రూ. 1.12 లక్షలు) బోనస్‌ ప్రకటించింది. 2021 మార్చి 81 కన్నా ముందు చేరిన సిబ్బందికి ఇది వర్తిస్తుందని కంపెనీ అంతర్గత మెమోలో పేర్కొంది. కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్ స్థాయి కన్నా దిగువ ఉద్యోగులందరితో పాటు పార్ట్‌-టైమ్‌ సిబ్బందికి కూడా ఈ బోనస్‌ అందిస్తున్నట్లు వివరించింది.

మైక్రోసాఫ్ట్‌ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 15,508 సిబ్బంది ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌ అనుబంధ సంస్థలైన లింక్ట్‌న్‌, గిట్‌హబ్‌, జెనిమ్యాక్స్‌ ఉద్యోగులకు ఈ బోనస్‌ వర్తించదు. ఈ బోనస్ బహుమతి విలువ సుమారు 200 మిలియన్‌ డాలర్లు ఉంటుంది. ఇప్పటికే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ పేస్‌బుక్‌ తమ 45,000 మంది ఉద్యోగులకు 1,000 డాలర్లు, ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తమ ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి 80 డాలర్ల మేర బోనస్‌ ప్రకటించాయి.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here