టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌కు సంబంధించి మరో సంచలన వార్త బయటకి వచ్చింది. తమ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగితో ఉన్న వివాహేతర సంబంధం వల్లే ఆయన బోర్డు పదవికి రాజీనామ చేయాల్సి వచ్చిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. తన జీవితం ఇక పూర్తిగా సామాజిక సేవకే అంకితం చేయాలని అనుకుంటున్నాని, అందుకే మైక్రోసాఫ్ట్‌ బోర్డుకు రాజీనామా చేస్తున్నట్లు బిల్‌గేట్స్‌ గతేడాది ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.(ఇది కూడా చదవండి: 5.5 కోట్ల యూజర్లకు ఎయిర్‌టెల్‌ స్పెషల్ ఆఫర్‌)

బిల్‌ గేట్స్‌ అప్పటి నుంచి గేట్స్‌ ఫౌండేషన్‌ కార్యక్రమాలకు ఎక్కువ కాలం కేటాయిస్తున్నారు. అయితే, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రకారం.. ‘‘2000 సంవత్సరంలో బిల్‌గేట్స్‌ తన మైక్రోసాఫ్ట్‌ సంస్థలో పనిచేసే మహిళా ఇంజనీర్‌ ఉద్యోగితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని భావించారు. సదరు మహిళ ఈ విషయం గురించి కొన్ని ఏళ్ల తర్వాత 2019లో బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బోర్డు.. చట్టబద్ధంగా ఆయనపై విచారణ చేసింది. ఆ సమయంలో బాధితురాలికి పూర్తి అండగా నిలబడింది’’ అని మైక్రోసాఫ్ట్‌ బోర్డు వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలపై దర్యాప్తు పూర్తికాక ముందే బిల్‌గేట్స్‌ రాజీనామా చేశారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది.

ఇక ఈ విషయంపై స్పందించిన బిల్‌గేట్స్‌ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘‘దాదాపు 20 ఏళ్ల క్రితం నాటి విషయం. అప్పుడు వారు ఆ బంధానికి స్నేహపూర్వంగానే ఇద్దరు ముగింపు పలికారు. అయితే బోర్డు పదవి నుంచి వైదొలగడానికి దీనికీ ఎటువంటి సంబంధం లేదు’’ అని అతనుపేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే భార్య మిలిందా గేట్స్‌తో 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ బిల్‌గేట్స్‌ ఇటీవల విడాకుల విషయం వెల్లడించిన విషయం అందరికి తెలిసిందే. వీరి బంధం ముగింపు పలకడానికి యాన్‌ విన్‌బ్లాడ్‌, ఝ షెల్లీ వాంగ్‌ అనే మహిళలు కారణం అయి ఉండవచ్చనే ఊహాగానాలు వినిపించాయి.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here