ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఓకాయా గ్రూప్ ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా, ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన సంస్థ హర్యానాలో మరో ప్లాంటు, నీమ్రానా(రాజస్థాన్)లో మరో మూడు ప్లాంట్లను 2023-25 నాటికి ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అవియోనిక్ సిరీస్, క్లాస్ ఐక్యూ సిరీస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్లలో అధునాతమైన టెక్నాలజీని భారతీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ స్కూటర్లు రూ.39,999 – రూ.60,000 ధరల శ్రేణిలో అందుబాటులో ఉండనున్నాయి.

భారతదేశంతో పాటు విదేశాల్లో కలిపి రెండు అత్యాధునిక ఆర్ అండ్ డీ సెంటర్లు నెలకొల్పనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ వాహనాల సరఫరాలో ఎటువంటి అంతరాయం రాకుండా ఉండటానికి దేశవ్యాప్తంగా షోరూమ్ లతో పాటు పంపిణీ, సేవా కేంద్రాలను తెరవనున్నట్లు ఓకాయా పవర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గుప్తా తెలిపారు. ఢిల్లీ, జైపూర్లలో రెండు ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొనిరావడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఉత్పత్తులన్నీ ‘మేడ్-ఇన్ ఇండియా’కి చెందినవి. 2025 నాటికి భారతీయ రోడ్లపై కోటి ఎలక్ట్రిక్-స్కూటర్లను తీసుకొని రావలన్న ప్రభుత్వ కలను సాకారం చేసేందుకు తమ వంతు సహకారం అందజేయనున్నట్లు గుప్తా తెలిపారు.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి