వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముగిసిన తర్వాత వాహనదారులపై పెట్రోల్ బాదుడు షురూ మొదలు పెట్టింది. గత ఏడాది చివరి సారిగా నవంబర్ 4న డీజిల్,పెట్రోల్ ధరలు పెరిగాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు మళ్లీ పెట్రోల్ ధరల పెంపు ప్రారంభమైంది. నేడు లీటర్ పెట్రోల్‌పై 90పైసలు, డీజిల్‌పై 84పైసలు ఆయిల్ కంపెనీలు పెంచాయి.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. అయితే, రోజురోజుకు చమురు సంస్థలు నష్టాలు పెరుగుతుండడంతో పెట్రో ధరల పెంపు అనివార్యమైందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ తర్వాత ధరలు మళ్లీ తగ్గే అవకాశం ఉన్నట్లు అభిప్రాయ పడుతున్నారు.
దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు:
లీటర్ పెట్రోల్ ధర | లీటర్ డీజిల్ ధర | |
హైదరాబాద్ | రూ.110 | రూ.96.36 |
విజయవాడ | రూ.111.99 | రూ.97.90 |
గుంటూరు | రూ.112.08 | రూ.98.10 |
న్యూఢిల్లీ | రూ.96.21 | రూ.87.47 |
ముంబై | రూ.110.82 | రూ.95.00 |
కోల్‌కతా | రూ.105.51 | రూ.90.62 |
చెన్నై | రూ.102.16 | రూ.92.19 |