ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పటివరకు ఎలక్ట్రికల్‌ వాహన తయారీ సంస్థలకు అందిస్తున్న సబ్సిడీని రెట్టింపు చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ధరలు తగ్గి అమ్మకాలు పేరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు భారీ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్‌ జారీ కూడా చేసింది. ఇప్పటివరకు కిలోవాట్‌ పర్‌ అవర్‌ సామర్థ్యం కలిగిన ఈవీ బైక్‌ తయారీ ధరలో 20 శాతంగా ఉన్న సబ్సిడీని 40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక కిలోవాట్ పర్‌ అవర్‌ (kWh) సామర్థ్యం కలిగిన బైక్‌ ధరలో రూ.15,000 సబ్సిడీ లభిస్తోంది.

450ఎక్స్‌ మోడల్‌పై రూ.14,500 తగ్గింపు

ఇక 2 kWh బైక్‌పై రూ. రూ. 30,000 సబ్సిడీ 3 kWh బైక్‌పై రూ. 45,000 వరకు సబ్సిడీ లభిస్తోంది. లక్షన్నర ధర లోపు గల బైకులకు ఈ సబ్సడీ వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈవీ వెహికల్స్‌పై సబ్సిడీని ఒకేసారి 50 శాతానికి పైగా పెంచడంతో ఏథర్‌ సంస్థ తన స్కూటర్ల ధరలను కూడా వెంటనే తగ్గించింది. ఏథర్‌ 450ఎక్స్‌ మోడల్‌పై రూ.14,500 ధర తగ్గిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈవీ అమ్మకాలు జోరు అందుకునే అవకాశం ఉందని అథర్‌ ఫౌండర్‌ తరుణ్‌ మెహతా ప్రకటించారు. 2025 నాటికి 60 లక్షల వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తరుణ్‌ మెహతా తెలిపారు. రివోల్ట్‌ మోటార్స్‌ ఈ నిర్ణయాన్ని గేమ్‌ ఛేంజర్‌గా ప్రకటించింది.

డిమాండ్‌ పెంచేందుకే

బస్సులు తప్ప మిగతా ఎలక్ట్రిక్ వాహనలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో మైలేజ్‌, ఛార్జింగ్‌ పరంగా 2 kWh సామార్థ్యం ఉన్న బైకులు పెట్రోలు బైకులకు పోటీగా నిలుస్తున్నాయి. అయితే ధరల విషయంతో పోల్చితే పెట్రోలు బైకుల కంటే ఈవీ బైకుల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులు వెనుక అడుగు వేస్తున్నారు. సబ్సిడీ ఇవ్వడం ద్వారా వెహికల్స్‌ ధర తగ్గించి, డిమాండ్‌ పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ వాడకాన్ని పెంచేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఫాస్టర్‌ అడాప్షన్‌ ఆఫ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ (FAME) పథకాన్ని అమల్లోకి తెచ్చింది. తాజాగా ఫేమ్‌ 2లో భాగంగా సబ్సిడీ మొత్తాన్ని పెంచింది. దీని కోసం కేంద్రం రూ. 10,000 కోట్లు కేటాయించింది.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.