Wednesday, October 16, 2024
HomeAutomobileCar Buying Guide: కొత్త కారు కొనుగోలు చేస్తున్నారా? అయితే ఇవి తప్పక తెలుసుకోండి!

Car Buying Guide: కొత్త కారు కొనుగోలు చేస్తున్నారా? అయితే ఇవి తప్పక తెలుసుకోండి!

Car Buying Guide Tips in Telugu: దేశంలో నానాటి కార్ల వినియోగం పెరిగిపోతుంది. ట్రాఫిక్ చిక్కులు.. పెరిగిపోతున్న రవాణ ఖర్చుల నుంచి ఉపశమనం పొందేలా ప్రయాణం సాఫిగా సాగాలంటే తప్పని సరిగా కారు ఉండాల్సిందేనన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. అందుకే మార్కెట్లో విడుదలైన కారు నచ్చిదంటే వెంటనే కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో కార్లు కొనుగోలు సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు తగిన జాగ్రత్తలు చెబుతున్నారు. వాటిల్లో ముందుగా..

రీసెర్చ్ అవసరం

మీరు ఓ కారు కొనుగోలు చేయాలని అనుకున్నప్పుడు.. చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, లేదంటే స్నేహితులు చెప్పారని కారును కొనుగోలు చేయకూడదు. కారు కొనేముందు డీలర్‌షిప్‌లలో ధరలు, ఫీచర్‌లు, కస్టమర్ రివ్యూలు చూడండి. ఆటోమోటివ్ వెబ్‌సైట్‌లు, ఫోరమ్‌లు, సోషల్ మీడియాలో అప్పటికే మీరు కొనాలనుకుంటున్న కారు వేరొకరు కొనే ఉంటారు.

ఆ కారు గురించి వారు అభిప్రాయాల్ని షేర్ చేస్తుంటారు. అవేంటే తెలుసుకోండి. దీంతో పాటు నిర్వహణ, ఇంధన సామర్థ్యం, బీమా ప్రీమియంలతో సహా దీర్ఘకాలిక ఖర్చుల గురించి ఆరా తీయండి. అలా చేయడం వల్ల కారు కొనుగోలు తర్వాత ఎదురయ్యే ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు

మీ బడ్జెట్‌ తెలుసుకోండి:

మీ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ను తయారు చేయండి. కారు కొనేందుకు మీరు చెల్లించే డౌన్ పేమెంట్ గురించి మాత్రమే కాకుండా.. కారుపై తీసుకున్న లోన్ కి ఎంత వడ్డిపడుతుంది. ఇన్స్యూరెన్స్, ఇంధన (పెట్రోల్, ఎలక్ట్రిక్) ఖర్చు, నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకోండి. మీ అవసరాలకు అనుగుణంగా ఉండే ఫీచర్లు ఉన్న కార్లకే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తవు

- Advertisement -

ఫైనాన్సింగ్ కంపెనీల విషయంలో జాగ్రత్త

ఫైనాన్సింగ్ కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నగదు చెల్లింపులు, వడ్డీ ఖర్చులను తగ్గించుకునేలా మీరు ఏ ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకుంటున్నారో..సదరు కంపెనీ ఇచ్చే ఆఫర్లు,జీరో డిస్కౌంట్, తక్కువ మొత్తంలో డౌన్ పేమెంట్ కట్టే అవకాశం ఇస్తుంది కదా అని లోన్ తీసుకోకూడదు. ఇతర బ్యాంకులు, లేదంటే ఫైనాన్స్ కంపెనీలు అంతకంటే మంచి ఆఫర్లు ఇవ్వొచ్చు. అందుకే మీరు ఏఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకుంటున్నారో..ఆ కంపెనీ ఇచ్చే ఆఫర్లు ఇతర ఫైనాన్స్ కంపెనీలు, లేదంటే బ్యాంకులు ఇచ్చే ఆఫర్లను బేరీజు వేసుకోండి. తద్వారా పెద్దమొత్తంలో డబ్బుల్ని ఆదా చేసిన వారవుతారు.

తెలివిగా చర్చలు జరపండి

కారు కొనుగోలు చేసే ముందు.. ఇతర డీలర్ షిప్ కంపెనీల్లో ధరలు, డిస్కౌంట్లు, ఆఫర్లు గురించి ముందుగా తెలుసుకోండి. అలా తెలుసుకోవడం వల్ల మీరు కారు కొనాలనుకుంటున్న డీలర్ షిప్ కంపెనీతో బేరసారాలు చేయొచ్చు. ఒకవేళ బయట మార్కెట్ ధరల కంటే మీకు ఎక్కువ ధరకే కారును అంటగట్టే అవకాశం ఉంది. మీకు అవసరం లేదనుకుంటే.. డీలర్ షిప్ కంపెనీని మార్చుకోవచ్చు.

పండగ సమయాల్లో తీసుకోండి

కారు కొనుగోలు విషయంలో ఖర్చు తగ్గించుకోనే ప్రయత్నాలు చేయండి. ముఖ్యంగా మీరు కారు కొనాలనుకుంటే ఏడాది చివరిలో, పండగలు, డీస్కౌంట్లు, కారు సేల్స్ లేనప్పుడు కారును కొనుగోలు చేయడం మంచిది. ఆ సమయాల్లో మీ బడ్జెట్ కు అనుగుణంగా కొత్త కారును సొంతం చేసుకోవచ్చు.

ఇన్స్యూరెన్స్ విషయంలో జాగ్రత్త

కారు ఇన్స్యూరెన్స్ తీసుకునే ముందు మార్కెట్ లో అందుబాటులో ఉన్న అన్నీ సంస్థల కారు ఇన్స్యూరెన్స్ ల గురించి తెలుసుకోండి. చట్టపరంగా మీ కారుకు తగిన రిస్క్ కవరేజీని అందించే ప్లాన్‌ను ఎంచుకోండి. ఇన్స్యూరెన్స్ ప్రీమియం తగ్గేలా యాడ్-ఆన్ కవర్లు, క్లెయిమ్ సెటిల్మెంట్ వంటి అంశాలను పరిగణించండి. అలారాలు, ఇమ్మొబిలైజర్‌లు, ట్రాకింగ్ పరికరాల వంటి భద్రతా ఫీచర్‌లను ఇన్‌స్టాల్ చేయడం వల్ల ఇన్స్యూరెన్స్ ప్రీమియంలు తగ్గుతాయని గుర్తుంచుకోండి.

ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి తెలుసుకోండి

ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, ఇతర ట్యాక్స్ ప్రయోజనాల గురించి ముందే తెలుసుకోండి. ఈ ప్రోత్సాహకాలు ముందస్తు ఖర్చులు, పెరిగిపోతున్న ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి.

- Advertisement -

గుర్తుంచుకోండి, కారు కొనుగోలుకు ముందు పూర్తి సమాచారం తెలుసుకోవడం ద్వారా ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడడమే కాకుండా.. కొన్ని సందర్భాలలో జరిగే మోసాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles