ఈ కొత్త ఏడాదిలో ఏపీ ప్రభుత్వం అవ్వాతాతలకు తీపికబురు చెప్పింది. ఏపీ సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ పింఛన్ మొత్తాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో వలంటీల్ల ద్వారా పింఛన్ల పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రతి నెలా 1వ తేదీ తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం రోజే రూ.2,250కి పింఛన్‌ను పెంచుతూ సంతకం చేశారు.
ఇప్పడు రూ.2,250 చొప్పున ఇస్తున్న వైఎస్ఆర్ పింఛన్ మొత్తాన్ని రూ.2,500కు పెంచింది. కొత్త సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఉదయం 11 గంటలకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సీఎం లాంఛనంగా ప్రారంభించిన అనంతరం అన్ని చోట్ల 11.30 గంటల తర్వాత వలంటీర్లు పంపిణీ మొదలు పెడతారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అలాగే, అవ్వాతాతల పింఛన్ వయస్సును 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకున్న 21 రోజులకే మంజూరు ప్రక్రియ పూర్తి కావాలన్న నిబంధన తీసుకొచ్చారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరించినా.. మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.