ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో నిర్వహించిన నవశకం సర్వే ద్వారా తెల్ల రేషన్ కార్డ్ కోల్పోయిన లబ్దిదారులకు మరలా కార్డు పొందటానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగి, ఆదాయపన్ను చెల్లింపు, పరిమితికి మించి సొంత భూమి, అధిక విద్యుత్తు వినియోగం, ఇతర కారణాలతో తెల్ల రేషన్ కార్డ్ కు అనర్హులైన వారు మరలా తిరిగి ధరఖాస్తు చేసుకోవచ్చని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా తెలిపారు. వీటి కోసం గ్రామ/వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ కార్డును పొందటానికి ఇది వరకు అనర్హత కలిగిన కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు, వారి కుటుంబ సభ్యుల వివరాలను జత చేసి తమ సమీపంలోని గ్రామ-వార్డు సచివాలయాల్లో అందజేయలి. ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించు కోవాలని ఏపీ ప్రభుత్వ సూచించింది.(చదవండి: అక్టోబర్ 13న లాంచ్ కానున్న ఆపిల్ ఐఫోన్ 12)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.