రోజువారీ వ్యాపారాలకు ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి అప్పులు తెచ్చుకుని, రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ములో అధిక శాతం.. ఆ అప్పులకు వడ్డీ చెల్లించేందుకే వెచ్చిస్తున్న చిరు వ్యాపారులను ఆదుకుంటానని ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా భరోసా ఇచ్చిన వైఎస్ జగన్..ఆ మాట నిలుపుకున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో వీధి వ్యాపారాలు చేస్తూ సేవలందిస్తున్న వారి కోసమే జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించినట్లుగా పేర్కొన్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుండి అప్పు తీసుకుని వచ్చి కట్టలేక వరి కబంధ హస్తలలో చిక్కుకోకుండా ఉండటానికి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. ఓక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: అన్నదాతలకు తీపికబురు.. అకౌంట్లలోకి రూ.2,000!)
చిన్న చిన్న అప్పుల కోసం వీధి వ్యాపారులు పడుతున్న అవస్థలను తన పాదయాత్రలో స్వయంగా చూసిన ఆయన, అధికారంలోకి రాగానే వారి ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేందుకు ‘జగనన్న తోడు’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన క్యాంప్ కార్యాలయం నుంచి 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.905 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను ఆన్‌లైన్‌లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. చిరు వ్యాపారులు 36–60 శాతం వడ్డీతో అప్పులు తెచ్చుకుని అష్టకష్టాలు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు ‘జగనన్న తోడు’ పథకాన్ని అమలు చేస్తున్నారు. రోడ్డు పక్కన రోజువారీ వ్యాపారాలు చేసేవారు, తోపుడు బండ్లు, చిన్న చిన్న కూరగాయల వ్యాపారులు, రోడ్ల పక్కన టిఫిన్, టీ స్టాల్స్, చిన్న దుకాణదారులు ఈ రుణానికి అర్హులు. వీరితో పాటు చేతి వృత్తి దారులైన లేస్ వర్క్, కలంకారీ, ఏటికొప్పాక బొమ్మలు, తోలు బొమ్మల తయారీదారులు, కళాకృతులతో కూడిన కుండల తయారీదారులు, బొబ్బిలి వీణలు, కంచు విగ్రహాలు, కళాత్మక వస్తువుల తయారీదారులు వంటి సంప్రదాయ వృత్తి కళాకారులకు సైతం వడ్డీ లేకుండా బ్యాంకుల నుంచి రూ.పది వేలు రుణం లభిస్తుంది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.