కరోనా రోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇప్పటికే కరోనా చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చిన తొలి రాష్ట్రంగా ఏపీ ప్రభుత్వం నిలిచింది. ఇప్పుడు, తాజాగా కోవిడ్ అనంతరం వచ్చే దుష్పరిణామాలను పేదలు తట్టుకునేందుకు పోస్ట్‌ కోవిడ్‌ చికిత్సలనూ కూడా ఆరోగ్య శ్రీలో చేరుస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీచేశారు. పోస్ట్‌ కోవిడ్‌ చికిత్సలకు ఎంత ధరలు ప్రైవేట్ ఆస్పత్రులు వసూలు చేయాలో కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ ధరలు నిర్ణయించారు. రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న అన్నీ ఆస్పత్రుల్లో తక్షణమే దీనిని అమలు చేయాలని సిఎం తెలిపినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఆక్సిజన్, సీపాప్, బైపాప్‌తో చికిత్స అందిస్తూ.. ఐసొలేషన్‌ వార్డు/ఐసీయూ రెంటు, అడ్మిని్రస్టేటివ్‌ చార్జీలు, నర్సింగ్, పర్యవేక్షణలన్నీ కలిపి రోజుకు రూ.900. కన్సల్టేషన్‌ చార్జీల కింద రూ.400, మందులు, నిర్ధారణ పరీక్షలకు రూ.700. ఆక్సిజన్, నెబులైజేషన్‌ చార్జీలు రూ.500.. పోషకాహారానికి రూ.200.. వైరస్‌ సోకకుండా డిస్‌ ఇన్ఫెక్షన్‌ చేసేందుకు రూ.230.. రోజుకు రూ.2,930 వరకూ చెల్లిస్తారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.