ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలోని యు.కొత్తపల్లి మండలంలోని కొమరగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు సాయంత్రం ప్రారంభించనున్నారు. దీనికి గుర్తుగా అక్కడే ఒక పైలాన్ కూడా ఆవిష్కరిస్తారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో, 30,75,755 మంది మహిళా లబ్ధిదారులకు ఉచిత హౌసింగ్ సైట్ ‘పట్టాలు’ పంపిణీ ఉమ్మడి ఏపీ చరిత్రలో ఇదే మొదటిసారి.

ఇంకా చదవండి: నేడు రైతుల అకౌంట్లోకి పీఎం కిసాన్ 2వేల రూపాయలు

అంతేకాకుండా, మొదటి దశలో 15,60,000 గృహాల నిర్మాణ పనులు ఒకే రోజున ప్రారంభించబడతాయి. ఈ ప్రధాన కార్యక్రమం కోసం ఏపీ ప్రభుత్వం రూ.23,535 కోట్ల విలువైన 68,361 ఎకరాలను కొనుగోలు చేసింది. ప్రతి ఇంటికి రూ.1.8 లక్షలు ఖర్చు చొప్పున ఈ పథకానికి మొత్తం రూ.28,800 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగనుంది. వివిద జిల్లాలో మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అలాగే ఈ నెల 28న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఉరందూరు వద్ద వైఎస్ జగన్ రెండోదశ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. దశల వారీగా అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. వీటికి సంబందించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డీ అధికారంలోకి వస్తే ఇళ్ల పంపిణీ చేయనున్నట్లు తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే నవరత్నాలలో పేదలందరికీ ఇళ్లు పథకాన్ని చేర్చారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here