YSR Zero interest loan scheme: రాష్ట్రంలోని మహిళకు సీఎం జగన్ శుభవార్త అందించారు. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వరుసగా రెండో ఏడాది కూడా బ్యాంకుల్లో వడ్డీ నగదును జమ చేయనుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక 8.71 లక్షల పొదుపు సంఘాలకు 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి నెలాఖరు వరకు బ్యాంకు రుణాలపై ఉన్న వడ్డీ మొత్తాన్ని 2020 ఏప్రిల్ 24న చెల్లించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ ఏడాది కూడా 2020-21 ఆర్దిక సంవత్సరంలో తీసుకున్న రుణాలపై వడ్డీ మొత్తం రూ.1,109 కోట్లను బ్యాంకులకు చెల్లించనున్నారు.
బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సకాలంలో కిస్తీలు చెల్లించిన మహిళలకు ఆ రుణంపై వడ్డీ మొత్తాన్ని ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పేరిట ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. గత ఆర్దిక ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 9,34,852 పొదుపు సంఘాలకు సంబంధించిన 1.02 కోట్ల మంది మహిళలు బ్యాంకుల నుంచి రూ.19,989 కోట్ల రుణాలు తీసుకుని నిబంధనల ప్రకారం కిస్తీలు చెల్లించారు. పారదర్శకత కోసం ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.