ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గుడ్‌ న్యూస్ చెప్పారు ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఉచితంగా 16వ విడత రేషన్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని నేటి(గురువారం, నవంబర్ – 19) నుంచి ప్రారంభించ‌నున్నట్లు తెలిపారు. ఒక్కొక్క‌రికి 5 కిలోల బియ్యం, కిలో శనగ పప్పు, కిలో గోధుమలను కూడా ఫ్రీగా అందించ‌నున్నట్లు చెప్పారు. ఒక్క శ్రీకాకుళం జిల్లా మినహా మిగిలిన అన్నీ జిల్లాలో కిలో గోధుమలను అందించనున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఉపాధి కోల్పోయిన పేద‌ల‌కు ఉచితంగా బియ్యం, స‌రుకులు పంపిణీ చేస్తోంది ఏపీ సర్కారు. ఇప్ప‌టికే 15 విడత‌లుగా ఉచిత రేషన్ పంపిణీ చేసింది. సీఎం జగన్ ఆదేశాలతో 16వ విడ‌తకు కూడా పంపిణీకి సిద్ధ‌మ‌వుతున్నారు అధికారులు. నేటి నుంచి బియ్యం, శనగ పప్పు, గోధుమలు ఉచితంగా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉచిత రేషన్ పంపిణీతో రాష్ట్రంలోని 1.48 కోట్ల రేష‌న్‌ కార్డుదారుల‌కు లబ్ధి చేకూర‌నుంది. (చదవండి: ఏపీ కొత్త జిల్లాల విషయంలో మరో ముందడుగు)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.