సీఎం జగన్ రైతులకు శుభవార్త అందించారు. ఖరీఫ్ సాగు ఖర్చుల కోసం ఈ ఏడాది మే 13న వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద తొలి విడత పెట్టుబడి సహాయాన్ని అందించనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా రాష్ట్రంలో అర్హులైన ఐదెకరాల లోపు గల రైతులు, అలాగే భూమిలేని ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ ఇతర ప్రభుత్వ భూములు సాగుచేస్తున్న రైతుల ఖాతాలో రూ.7,500 చొప్పున జమ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులను ఆర్ధికంగా ఆదుకోవడానికి కొత్త కొత్త పథకాలను తీసుకొచ్చారు. అందులో భాగంగానే వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద రైతులకు కేంద్రం అందిస్తున్న 6వేల రూపాయలతో పాటు రైతు భరోసా కింద 7,500 రూపాయలు కలిపి మొత్తం 13,500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రెండేళ్లుగా లబ్ధిపొందని అర్హుల కోసం ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులందరికి మే నెల 13వ తేదీన తొలి విడత రైతు భరోసా-పీఎం కిసాన్ కింద నగదును రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.