Encumbrance Certificate: మనం ఏదైనా కొత్త ఇల్లు, భూమి, ప్లాట్ కొనాలన్న చాలా మంది మనను అడిగే ప్రధాన ప్రశ్న? ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్(EC) ఆ ప్లాట్, భూమి, ఇల్లు వివరాలు సరిగా చెక్ చేశావా ఆ అడుగుతారు. అప్పుడు మనం ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్(EC) ఆ! అసలు ఈసీ అంటే ఏమిటి? అది ఎందుకు ముఖ్యం అని అవతలి వారిని ప్రశ్నిస్తాము.
మనలో చాలా మందికి ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్(EC) అంటే ఏమిటి అనేది తెలియదు. అసలు దాని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా తెలియవు. అయితే, ఇప్పుడు మనం దాని గురుంచి పూర్తిగా తెలుసుకుందాం.
ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్(Encumbrance Certificate) అంటే ఏమిటి?
ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే భూమి యొక్క పూర్తి చరిత్రను తెలియజేస్తుంది. సులభంగా చెప్పాలంటే మనం బ్యాంక్ ఖాతా తీసుకున్న తర్వాత ఏదైనా లావాదేవీలు జరిపితే స్టేట్ మెంట్ రూపంలో మనం ఎంత మందికి డబ్బులు పంపాము. వేరే వాళ్లు మనకు ఎంత డబ్బులు పంపారు అనేది తెలుస్తుంది. అలాగే, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది భూమి గత ఏళ్లుగా ఎంత మంది చేతులు మారింది అనేది తెలియజేస్తుంది.
(ఇది కూడా చదవండి: ఇనాం భూములు అంటే ఏమిటి? వాటిని అమ్ముకోవచ్చా..?)
ఒకే వ్యక్తి ఇల్లు/భూమి కొనుగోలుచేసే ముందు అతనికి కలిగే చాలా ప్రశ్నలకు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్(Encumbrance Certificate) సమాధానాలను తెలుపుతుంది. సాదారణంగా మనం భూమి/ఇల్లు కొనే ముందు మనకు ఈ క్రింది ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి.
- ఈ ఆస్తిని విక్రేత బ్యాంకుకు తాకట్టు పెట్టరా? లేదా అనేది ఎలా నిర్ధారించుకోవాలి?
- ఈ ఆస్తిని విక్రయించే వ్యక్తి నిజంగానే ఆ భూమి చట్టపరమైన యజమానినా?
- ఈ ఆస్తి ప్రారంభమైనప్పటి నుంచి ఎంత మంది చేతులు మారింది?
- నేను కొనుగోలు చేసే ఆస్తిపై అప్పులు ఏమైనా ఉన్నాయా?
- గత యజమాని ఈ ఆస్తి మీద వ్యతిరేకంగా రుణం తీసుకున్నారా?
ఇలా మనకు ఎదురైనా ప్రశ్నలకు సమాధానాన్ని ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్(ఈసీ)లో కనుగొంటారు. ఒక వ్యక్తి భూమి, ఇల్లు కొనేముందు తప్పక చెక్ చేయాల్సిన పత్రాలలో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది ఒకటి. ఆస్తిపై చట్టపరమైన యాజమాన్యాన్ని నిర్ధారించడానికి ఇది ఒక ముఖ్యమైన కాగితం అని భావించి, కొనుగోలుదారులు ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్(Encumbrance Certificate) గురించి ప్రతిదీ తెలుసుకోవాలి.
(ఇది కూడా చదవండి: నాలా(NALA) అంటే ఏమిటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి)
ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది ఒక చట్టపరమైన పత్రం. ఇది ఒక నిర్దిష్ట ఆస్తిపై ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నాయా?, చట్టపరమైన సమస్యలు, ఆర్థిక భారాలు ఉన్నాయా లేదా? అనేది తెలియజేస్తుంది. పైన ఎదురైన అన్నీ ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్(ఈసీ).
ఆక్యుపెన్సీ సర్టిఫికేట్(Occupancy Certificate) అంటే ఏమిటి?
ఒక ఇంటిని కొనుగోలు చేయాలన్నా, విక్రయించాలి అనుకున్న ప్రధానంగా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అవసరం. ఏదైనా ఒక కొత్త ఆస్తిని కొనుగోలు చేసే ముందు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ను ఎందుకు తీసుకోవాలి. అసలు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే ఏమిటి? ఎందుకు తీసుకోవాలి? అనే వివరాల గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆక్యుపెన్సీ సర్టిఫికేట్(Occupancy Certificate) అనే దానిని స్థానిక ప్రభుత్వ సంస్థల అధికారులు జారీచేస్తారు. ఒక భవనం దానికి కేటాయించిన పరిధిలో, ప్రభుత్వం ఆమోదించిన ప్రణాళిక ప్రకారం, స్థానిక చట్టాలకు అనుగుణంగా నిర్మితమైందా? లేదా అనే అంశాల ఆధారంగా ఈ సర్టిఫికేట్‌ను స్థానిక ప్రభుత్వ అధికారులు జారీ చేస్తారు.
భవన నిర్మాణానికి వర్తించే బిల్డింగ్ కోడ్‌లను అనుసరించి, సాధారణ నియమాలకు, చట్టాలకు అనుగుణంగా భవన నిర్మాణం జరిగింది అని ధ్రువీకరించే పత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. ఒకసారి ఇంటి నిర్మాణం పూర్తైతే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్(ఓసీ)ను పొందడం కట్టడం నిర్మాణదారుని/యజమాని భాద్యత. మంచినీరు, శానిటేషన్, విద్యుత్ కనక్షన్లు వంటి వాటి కోసం ఇది అవసరం అవుతుంది.
(ఇది కూడా చదవండి: ఎఫ్-లైన్ పిటిషన్ అంటే ఏమిటి? భూ సర్వే కోసం ఎఫ్-లైన్ పిటిషన్ అప్లై చేయాలా..!)
ఆస్తిపై చట్టపరమైన హోదాను దృవీకరించేందుకు గృహ యజమానులకు ఈ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అవసరం. ఓసీ లేకపోతే స్థానిక మున్సిపల్ కార్యాలయ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. గృహ రుణం పొందాలన్నా ఒసీ అవసరం. మీ పాత బిల్డింగ్‌ను కొనాలన్నా/అమ్మాలన్నా కూడా ఓసీ తప్పనిసరిగా ఉండాలి.
ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఎప్పుడు అవసరం?
- మీరు ఆస్తిని కొనుగోలు చేస్తున్నప్పుడు
- ఆ ఆస్తి నిజమైన యజమానివాడా కాదా అని నిర్ధారించుకోవడానికి
- ఆ ఆస్తిని తనకా పెట్టి రుణాలు తీసుకున్నాడో లేదో తెలుసుకోవడానికి
- మీరు ఆస్తిని కొనడానికి గృహ రుణం తీసుకునేటప్పుడు
- ఇల్లు కొనడానికి మీ ప్రావిడెంట్ ఫండ్ నుంచి డబ్బును ఉపసంహరించుకునేటప్పుడు
- మీరు ఆస్తి మ్యుటేషన్ కోసం వెళ్ళినప్పుడు
నిల్-ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఏమిటి?
ఒక ఆస్తి కోసం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నిల్-ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ జారీ చేస్తుంది, ఇది దరఖాస్తుదారుడు ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ కోరిన కాలంలో ఎటువంటి లావాదేవీలను చూడలేరు. ఫారం 16లో నిల్-ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.

ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కోసం కావాల్సిన పత్రాలు?
- చిరునామా రుజువు,సంతకం
- ECని కోరుతున్న ఆస్తి వివరాలు
- ఆస్తి కోసం ఒక దస్తావేజు సృష్టించబడి ఉంటే దస్తావేజు నకలు
- రెండూ తెలుగు రాష్ట్రాలలో ఆన్‌లైన్‌లో ఉచితంగా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు ఎన్ని రకాలు
ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లకు రెండు రకాలు ఉన్నాయి. దరఖాస్తుదారుడు సర్టిఫికేట్ కోరిన కాలంలో ఒక ఆస్తికి ఏదైనా అవాంతరాలు ఉంటే, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఫారంలో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఇస్తుంది 15. దరఖాస్తుదారుడు సర్టిఫికేట్ కోరిన వ్యవధిలో ఏదైనా ఆస్తి నమోదు చేయకపోతే, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఫారం 16లో నిల్-ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఇస్తుంది.
ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ కోసం రూ.200 నుంచి రూ.500 వరకు చార్జ్ చేసే అవకాశం ఉంది. ఈసీని ఆఫ్‌లైన్ పొందడానికి కనీసం 15 నుంచి 30 రోజుల మధ్య సమయం పట్టవచ్చు.
ఆక్యుపెన్సీ సర్టిఫికేట్(Occupancy Certificate)ను పొందడం ఎలా?
బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యే 30 రోజులలో భవణ నిర్మాణదారుడు ఓసీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆస్తి యజమానిగా మీరు కూడా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓసీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన అన్ని ప్రమాణాల ప్రకారం నిర్మాణం పూర్తిచేస్తే దరఖాస్తు చేసిన 30 రోజులలోపు ఓసీని పొందుతారు.
దరఖాస్తు చేసేందుకు కావలసిన పత్రాలు:
- నిర్మాణ ప్రారంభ ప్రమాణపత్రం
- నిర్మాణ పూర్తి ప్రమాణపత్రం
- అగ్ని, కాలుష్యం కోసం ఎన్ఓసీలు
- తాజా ఆస్తి పన్ను రసీదు
- భవన నిర్మాణం కోసం మంజూరు చేసిన ప్రణాళిక కాపీ
