Fline-Petition

F-Line Petition: భూమి, ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ రెవెన్యూ రికార్డులలో ఉన్న పదాల గురించి తెలుసుకోవడం తప్పనిసరి. భూమి ఉన్న వారికి, లేని వారికి, భూమితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు భూమి రికార్డుల అవసరం పడుతుంది. ఎందుకంటే భూమికి సంబంధించిన వివిధ వివరాలు ఈ భూమి రికార్డులలో ఉంటాయి. భూమి ఎంతకాలం నుంచి సాగు చేస్తున్నా / అనుభవిస్తున్నా / స్వాధీనంలోఉన్నా రికార్డుల్లో పేరు లేకపోతే చట్టపరంగా హక్కుదారులు కాలేరు. ఇంతటి ముఖ్యమైన రికార్డుల గురించి తేలుసుకోవడం చాలా అవసరం.

ఎఫ్-లైన్ పిటిషన్ అంటే ఏమిటి?

కొన్ని సార్లు వాస్తవానికి భూ రికార్డులో ఉన్న భూమి ఫీల్డ్ మీద కనిపించదు. అలాగే, పక్క పొలం వ్యక్తులతో పొలం గట్ల విషయంలో చాలా సార్లు గొడవ జరుగుతుంది. అయితే, ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడం మంచి పని. భూ విస్తీర్ణం తక్కువగా ఉన్న, పొలం గట్ల విషయంలో గొడవలు ఉన్న, కొత్తగా భూమి కొనేటప్పుడు ఎఫ్-లైన్ పిటిషన్ కోసం అప్లై చేసుకోవడం చాలా మంచిది.

(చదవండి: అవ్వాతాతలకు ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుక..!)

అసలు ఎఫ్-లైన్ పిటిషన్ అంటే మన భూమి రికార్డులో చూపించినంత ఉందా అనే దానికోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ. ఇలా, దరఖాస్తు చేసుకోవడం వల్ల అసలైన భూ విస్తీర్ణం తెలవడంతో పాటు భూ సరిహద్దులు నిర్దేశించబడుతాయి. భూ విస్తీర్ణంలో ఏదైనా అనుమానం వెంటనే ఎఫ్-లైన్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది.

ఎఫ్-లైన్ పిటిషన్ దరఖాస్తు విధానం:

  • ఎఫ్-లైన్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవకు వెళ్ళండి.
  • ఎఫ్-లైన్ పిటిషన్ ఫారంలో మీ పూర్తి వివరాలు నమోదు చేసి మీ సేవలో దరఖాస్తు చేసుకోండి.

మీరు మీ సేవ ద్వారా ఎఫ్-లైన్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాక మీ దరఖాస్తు మండల తహశీల్దార్ కార్యాలయానికి వెళ్తుంది. అక్కడ మీ గ్రామ రెవెన్యూ అధికారి మీ పరిశీలించాక పై అధికారి తహశీల్దార్ కు పంపిస్తారు. ఆ తర్వాత అధికారి నుంచి అనుమతి వచ్చాక మండల్ సర్వేయర్ మీ భూమి దగ్గరకు వచ్చి భూమిని కొలిచి హద్దులు నిర్దేశించిన తర్వాత మీకు పట్టా ఇస్తారు. ఈ ఎఫ్-లైన్ పిటిషన్ కోసం ఎకరాకు రూ.1000 రుసుము ఉండవచ్చు. ఈ పని అంత 30 రోజులలో జరుగుతుంది.

ఎఫ్-లైన్ పిటిషన్ కోసం కావాల్సిన పత్రాలు:

  • అర్జీ పత్రం
  • భూమి పట్టా పాస్ బుక్ నకలు
  • ఆధార్ కార్డు నెంబర్
  • టైటిల్ డిడీ నకలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here