ఎల్పీజీ (LPG) వినియోగదారులకు ఇండియన్ గ్యాస్ ఎజెన్సీ శుభవార్త చెప్పింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వినియోగదారులు ఇప్పుడు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పిజి) రీఫిల్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. భారతదేశం అంతటా ఇండేన్ గ్యాస్ యూజర్లు రీఫిల్ సిలిండర్ బుకింగ్ చేయడానికి ‘8454955555’ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే గ్యాస్ బుకింగ్ అవుతుందని ఇండియన్ ఆయిల్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇప్పటికే ఈ సేవలు మెట్రో నగరాలైన ముంబై, కలకత్తా, బెంగళూరు వంటి నగరాలలో అందుబాటులో ఉన్నాయని ఇండియన్ సంస్థ పేర్కొంది.
ఇంకా చదవండి: ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ.. చెక్ చేసుకోండి ఇలా!
“వినియోగదారులు వేగంగా రీఫిల్స్ బుకింగ్ చేసుకోవడం కోసం ఎక్కువసేపు కాల్స్ చేయకుండా ఉండటానికి మిస్డ్ కాల్స్ సేవలను తీసుకొచ్చినట్లు” ఐఓసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సేవలు సీనియర్ సిటిజన్లకు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ఎంతగానో సహాయపడుతుంది అని ఐఓసీ పేర్కొంది. ఒడిశా రాజదాని భువనేశ్వర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎల్‌పిజి కస్టమర్ల కోసం మిస్డ్ కాల్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ఎల్‌పీజీ డెలివరీ వ్యవధిని ఒక రోజు నుంచి కొన్ని గంటలకు తగ్గించేలా గ్యాస్ ఏజెన్సీలు, పంపిణీదారులు ఉండేలా చూడాలని ఆయన కోరారు. 2014కి ముందు ఆరు దశాబ్దాల్లో ఇచ్చిన ఎల్‌పిజి కనెక్షన్లు సుమారు 13 కోట్లు అయితే గత ఆరు సంవత్సరాల్లో 30 కోట్ల ఎల్‌పిజి కనెక్షన్లు ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ని Subscribe చేసుకోండి.